‘సైరా’ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది లైవ్‌ కాన్సర్ట్‌ 24న

ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది నవంబర్‌ 24న తొలిసారి హైదరాబాద్‌లో మ్యూజిక్‌ లైవ్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో జోనితా గాంధీ, దివ్యా కుమార్‌ తదితరులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం సంగీత ప్రియులకు తప్పకుండా వీనుల విందుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ‘ఇంద్రధనుష్‌ – అమిత్‌ త్రివేది లైవ్‌ కాన్సర్ట్‌’ అనే పేరుతో ఈ సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనిషి తన జీవితంలో సంతోషం, బాధ, ప్రేమ ఇలాంటి ఎన్నో అనుభవాలను చవిచూస్తాడు. అలాంటి అనుభవాల కలయికనే ఇంద్రధనుస్సు అని మనం సంబోధిస్తుంటాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్‌కు ఇంద్రధనుష్‌ అనే పేరుని పెట్టారు. ఈ కార్యక్రమంలో అమిత్‌ సౌండ్‌లో కొత్త టెక్నాలజీని అందరికీ పరిచయం చేయబోతున్నారు.
థియేటర్స్‌లో మ్యూజిక్‌ కంపోజర్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన అమిత్‌ త్రివేది పలు జింగిల్స్‌, యాడ్‌ ఫిలింస్‌కు పనిచేశారు. ‘ఆమిర్‌’ చిత్రంతో 2008లో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ‘దేవ్‌ డి’ చిత్రం కోసం అనురాగ్‌ కశ్యప్‌తో జత కట్టారు. ఈ చిత్రానికిగాను అమిత్‌ త్రివేదికి నేషనల్‌ అవార్డు కూడా దక్కింది. ఉడాన్‌, వేకప్‌ సిద్‌, మన్‌ మర్జియాన్‌ వంటి చిత్రాలకు ఈయన తన సంగీతాన్ని అందించారు.
ఇండియన్‌ సినిమాల్లో కొత్త సంగీతాన్ని పరిచయం చేసిన సంగీత దర్శకుల్లో అమిత్‌ త్రివేది తనదైన మార్కును చూపించారు. కేవలం పాశ్చాత్య సంగీత పోకడలతో అందరినీ ఆకట్టుకోవడమే కాదు.. శాస్త్రీయ సంగీతంపై మంచి అవగాహన ఉంది. తెలుగులో ఎంతో ప్రెస్టీజియస్‌ చిత్రంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’తో ఇక్కడి తెలుగు ప్రేక్షకులను మైమరపింప చేయడానికి హైదరాబాద్‌ వస్తున్న అమిత్‌ త్రివేదికి హైదరాబాద్‌ ఘన స్వాగతం పలుకుతుంది.

SYRAA music director Amit Trivedi live concert in hyd

One of India’s finest music composers and the torchbearer of the new generation Indian MusicScenario, Amit Trivedi is going to perform his first ever live in concert at Hyderabad onNovember 24th, 2018. He, along with his amazing team including the popular Jonita Gandhi,Divyaa Kumar and several others have joined together to enthrall the music lovers ofHyderabad with a unique and outstanding experience. The concert is named as “Indra Dhanush- Amit Trivedi Live In Concert”, The Colours of Life, based on the concept of a rainbow, where each colour would be representing a mood and an emotion. They would be representing each colour to one aspect, like Nature, Womanhood, Love, etc and performing each song relevant to that. Also, Amit Trivedi is all set to launch a new technology of sound in the field of live shows for the first time in India.
Started his career as a composer for Theatre, Jingles and Ad films, he debuted in Bollywood in2008 with the movie Aamir, which was sort of a pathbreaking musical experience. He then joined hands with the maverick Anurag Kashyap for Dev D, whom he worked for many movies in the future and is a close associate of. Dev D introduced the world of Indian music to a genius called Amit Trivedi, who went on to win National Award for the same. He wrote amazing music for the musical hits like Udaan, Wake Up Sid, Aisha, Ishaqzaade, English Vinglish, Lootera,Love You Zindagi, Fitoor, Bombay Velvet, Udta Punjab, Manmarziyaan and many more. As a master music producer, arranger and singer, he did extraordinary work even in non film albums and live shows like MTV Unplugged, Coke Studio, Mirchi Music Awards, and multiple events.
Amit Trivedi’s music has brought a new style of music to Indian cinema. A never before kind of experimentation in the style of arrangements and the genres but still holding a deep root to the culture of the music he is composing. His music takes one to a trance and overwhelms into the emotion of the track. There is never a miss of the melody, but there is no template of the music too. That zone, is only possible for a musical genius.
With him debuting into Telugu music, after this long, with none other than Megastar
Chiranjeevi’s Magnum Opus “Sye Raa Narasimha Reddy”, it is a privilege for the audience here to experience his music. He is like none other. If there is One Ilayaraja in the previous
generation, followed by A.R.Rahman, Amit Trivedi can be regarded as that one special talent.