అద్భుతం ఇలా జరుగుతుందని ఊహించలేదు!

తాప్సీ సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా సరికొత్త రికార్డ్ సాధించింది. తెలుగులో ఆమెకి సరైన బ్రేక్‌ రాకపోవడంతో బాలీవుడ్‌ కి వెళ్ళిపోయింది. అక్కడ తాప్సీ నటించిన ‘బేబీ’, ‘పింక్’ సినిమాల కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆమె నటనకి మంచి గుర్తింపు వచ్చింది. గత ఏడాది తాప్సీ నటించిన ‘బద్లా‘, ‘గేమ్ ఓవర్‘‌, ‘మిషన్ మంగళ్‌’, ‘శాండ్ కీ ఆంఖ్‘‌ చిత్రాలు ఏకంగా 352.13 కోట్ల రూపాయల వసూళ్ళు రాబట్టాయి. ‘తప్పడ్‘‌ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదల కాగా.. లాక్‌డౌన్ వలన బాక్సాఫీస్ దగ్గర సరైన వసూళ్ళు రాబట్టలేకపోయింది.
తాప్సీ నటించిన ‘బద్లా’ చిత్రం 88 కోట్లు, ‘గేమ్ ఓవర్’‌ చిత్రం 4.69 కోట్లు, ‘సాండ్ కీ ఆంఖ్‌’ 23.40 కోట్లు, మిషన్ మంగల్‌ 202.98 కోట్ల వసూళ్ళు రాబట్టింది. ఈ ఏడాది విడుదలైన ‘థప్పడ్’ చిత్రం రూ. 33.06 కోట్లు వసూలు చేసింది. అంటే గత 12 నెలలో తాప్సీ చిత్రాలు ఏకంగా 352.13 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్‌ సాధించాయి.
2019లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన నటిగా తాప్సీ అరుదైన రికార్డ్‌ సాధించగా..దీనిపై స్పందించిన తాప్సీ “ఓ.. అద్భుతం ఇలా జరుగుతుందని ఊహించలేదు!” అని కామెంట్‌ పెట్టింది. క్వారంటైన్‌లో దీనిని శుభవార్తగా భావించి సెలబ్రేట్‌ చేసుకుంటానంటుంది సొట్టబుగ్గల సుందరి. తాప్సీకి దియా మీర్జా తో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
అన్నీ 3 పాటలు, 5 సీన్ల పాత్రలే !
బాలీవుడ్‌కే దాదాపు పరిమితమైపోయింది తాప్సీ. అక్కడామెకు క్రేజ్ ఉంది… అయినా, సౌత్ సినిమాను తాను వదులుకోనంటోంది ఈ పంజాబీ బ్యూటీ. కానీ, సౌత్ నుంచి 3 పాటలు, 5 సీన్లు ఉండే పాత్రలే వస్తున్నాయని చెబుతోంది తాప్సీ. అందుకే పెద్ద హీరోల సినిమాలైనప్పటికీ వాటిని వదులుకుంటున్నానని స్పష్టంచేసింది. “సౌత్‌లో గత ఏడాది ‘గేమ్ ఓవర్’ చేశాను. అది తెలుగు, -తమిళ భాషల్లో రిలీజైంది. సౌత్‌లో ప్రతి ఏటా ఓ సినిమా చేయాలనుకుంటాను. కానీ సమస్య ఏంటంటే.. సౌత్‌లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేయడం వల్ల 3 పాటలు, 5 సీన్లు ఉండే పాత్రలే వస్తున్నాయి. అలా అని కథ మొత్తం నా చుట్టూరా తిరగాలని నేను కోరుకోను.పెద్ద హీరోల సినిమా ఆఫర్లే అయినప్పటికీ ప్రాధాన్యత లేని సినిమాలు చేయను. తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినప్పటికీ నా పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఆ సినిమా చేస్తా. చిన్న పాత్ర చేసినా బలంగా ఉండాలి”అని తాప్సీ చెప్పింది.
 
ట్రోలింగ్స్‌పై తాప్సీ స్పందిస్తూ… ట్రోలింగ్స్‌ను ఎంజాయ్ చేస్తానంటోంది…“నన్ను ట్రోల్ చేస్తే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే, మనలో విషయం ఉన్నప్పుడే కదా మనల్ని ట్రోల్ చేస్తారు. మనపై అందరి దృష్టి ఉంటేనే కదా.. మనం ట్రోలింగ్ కు గురవుతాం. కాబట్టి అది ఎంజాయ్ చేయాల్సిన విషయమే. అందరూ నన్ను తిడుతున్నారంటే.. నా జీవితంలో విషయం ఉన్నట్టే కదా”అని తాప్సీ అంటోంది.