ఆమె చేస్తున్నవన్నీ క్రీడాకారిణి పాత్రలే !

తాప్సీ గత కొన్ని రోజులుగా తన నటనలోని విలక్షణను చూపిస్తోంది. ‘పింక్‌’ చిత్రంలో లైంగిక బాధితురాలిగా కఠినమైన పాత్రలో, ‘ఆనందోబ్రహ్మ’లో బయపెట్టించే పాత్రలో, ‘నామ్‌ షబానా’ జుడో ఫైటర్‌గా, ఏజెంట్‌గా, ‘జుడ్వా 2’, ‘దిల్‌ జంగ్లీ’లో లవర్‌గా బబ్లీ పాత్రలు పోషించి మెప్పించింది. ప్రస్తుతం క్రీడాకారిణిగా మారిపోతుంది. ప్రస్తుతం నటిస్తున్న మూడు చిత్రాల్లోనే తాప్సీ క్రీడాకారిణి పాత్రలే పోషిస్తుండటం విశేషం….

హాకీ క్రీడాకారుడు సందీప్‌ సింగ్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘సూర్మ’ చిత్రంలో హాకీ ప్లేయర్‌గా నటిస్తుంది. దీనికి షాద్‌ అలీ దర్శకుడు. అలాగే అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన్మర్జియాన్‌’లో హాకీ నేర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న హాకీ ఔత్సాహికురాలిగా నటిస్తుంది. ఇందులో అభిషేక్‌ బచ్చన్‌, విక్కీ కౌశల్‌ హీరోలుగా నటిస్తున్నారు. దీంతోపాటు త్వరలో పట్టాలెక్కే చిత్రంలో ప్రొఫేషనల్‌ షూటర్‌గా కనిపించనుంది. ఇదిలా ఉంటే ఈ మూడు చిత్రాలు క్రీడా నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రాలుగా తెరకెక్కనుండటం విశేషం. దీంతోపాటు అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో ‘ముల్క్‌’ చిత్రంలో తాప్సీ నటిస్తోంది.