కన్నడ ‘రియల్ స్టార్’ ఉపేంద్ర ‘కబ్జా’ ప్రారంభం

కన్నడ ‘రియల్ స్టార్’ ఉపేంద్ర. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం’కబ్జా’. 1947-80ల మధ్య అండర్ వరల్డ్ డాన్ కథాంశంతో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇది. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ పతాకంపై లగడపాటి శ్రీధర్ సమర్పణలో ఆర్.చంద్రు దర్శకుడిగా ఆర్.చంద్రశేఖర్, రాజ్ ప్రభాకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం జనవరి4న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది . పూజాకార్యక్రమాల అనంతరం ఉపేంద్ర పై చిత్రీకరించిన ముహూర్తుపు సన్నివేశానికి రమేష్ ప్రసాద్ క్లాప్ నివ్వగా, బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.ఇదే వేదికపై ‘కబ్జా’ మోషన్ పోస్టర్ ని లగడపాటి శ్రీధర్ లాంచ్ చేశారు. ‘ఓం’, ‘ఎ’, ‘రా’, చిత్రాలతో సెన్షేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఉపేంద్ర “సన్నాఫ్ సత్యమూర్తి” చిత్రంలో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసారు. హీరో ఉపేంద్ర, దర్శకుడు ఆర్.చంద్రు, సమర్పకుడు లగడపాటి శ్రీధర్, నిర్మాతలు ఆర్.చంద్రశేఖర్, రాజ్ ప్రభాకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మునేంద్ర కె.పుర, కో-ప్రొడ్యూసర్స్ గోనుగుంట్ల శ్రీనివాస్, ఆర్.రాజశేఖర్, ఆనంద్ గురూజీ, హెచ్ యం, రేవన్న, ఫైట్ మాస్టర్ రవి వర్మ, తదితరులు పాల్గొన్నారు.
 
రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ.. ‘ఎ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వరకు నన్నుఅభిమానిస్తూనే వున్నారు. కబ్జా ఒక అండర్ వరల్డ్ డాన్ కథ. చాలా కొత్త జోనర్లో ‘పాన్ ఇండియా’ స్థాయిలో చెయ్యాలని టీమ్ అంతా ప్లాన్ చేశాం. అప్పట్లో ‘ఓం’ చిత్రాన్ని ఎక్స్ పెరిమెంట్ చేశాం. అలాగే ఓ కొత్త జోనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చంద్రు ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటాడు. అతనితో చేసిన రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. మా కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రం కూడా ప్రేక్షకుల హృదయలను కబ్జా చేస్తుంది..అన్నారు.
 
దర్శకుడు ఆర్. చంద్రు మాట్లాడుతూ… ‘బ్రహ్మ’, ‘ఐ లవ్ యు’ తరువాత ఉపేంద్ర గారితో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. 1947-80లలో జరిగిన అండర్ వరల్డ్ డాన్ కథ ఇది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మాస్ హిట్ చెయ్యాలని కసితో వర్క్ చేస్తున్నాం..అన్నారు.
 
చిత్ర సమర్పకుడు లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. చంద్రు వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. ఆయనతో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమా చేశాను. ఆ చిత్రం జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికై అవార్డు లభించింది. కబ్జా కథవినగానే నాకు బాగా నచ్చింది. ఈ చిత్రానికి వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు హ్యాపీగా ఉంది. ‘ఓం’ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నాం..అన్నారు.