ఊర్వశి రౌతేల ‘బ్లాక్ రోజ్’ ప్రమోషనల్ సాంగ్

శ్రీనివాసా చిట్టూరి ‘శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్’‌ బ్యానర్ పై పవన్ కుమార్ సమర్పణలో ‘బ్లాక్ రోజ్’ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది క్రియేషన్లో ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మిస్ యూనివ‌ర్స్‌ ఇండియా’ గా రెండు సార్లు గెలుపొందిన అందాల తార ఊర్వశి రౌతేల హీరోయిన్ గా ‘బ్లాక్ రోజ్’ ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్ర బృందం ‘నా తప్పు ఏమున్నదబ్బా’ అంటూ సాగే ప్రమోషనల్ వీడియో సాంగ్  మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్    ద్వారా విడుదలైంది. మణి శర్మ కంపోజ్ చేసిన ఈ పాటకి జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. ఊర్వశి రౌతేల తన అందంతో పాటు అద్భుతమైన డాన్స్ స్టెప్స్ తో విశేషంగా ఆకట్టుకున్నారు.
ఊర్వశి రౌతేల మాట్లాడుతూ..” బ్లాక్ రోజ్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమా నటిగా నాలో ఇంకో కోణాన్ని ఆవిష్కరించే అవకాశం ఇవ్వడమే కాకుండా.. చాలా కష్టమైన డాన్స్ నేర్చుకుని చేసే అవకాశం ఇచ్చింది. ఈ పాట అద్భుతంగా వచ్చింది.ఈ అవకాశం ఇచ్చిన సంపత్ నంది గారికి, శ్రీనివాసా చిట్టూరి గారికి కృతజ్ఞతలు”అని చెప్పింది.

షేక్స్ పియర్ రచించిన ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’ లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్  గా ‘బ్లాక్ రోజ్’ తెరకెక్కుతోంది. ‘విచక్షణ లేని యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే కౌటిల్యుడి అర్థ శాస్త్రం లోని కాన్సెప్ట్ తో  ‘బ్లాక్ రోజ్’ రూపొందింది. ఆగష్టు లో ప్రారంభమైన ఈ చిత్రం తెలుగు. హిందీ భాషల్లో ఒకే షెడ్యూల్ లో ఏకధాటిగా షూటింగ్ జరుపుకుని నిర్మాణం పూర్తి చేసుకుంది.