సముద్ర ‘వరదరాజు గోవిందం’ టీజర్ రిలీజ్ ఈవెంట్ !

సింహరాశి, శివరామరాజు, ఎవడైతే నాకేంటి లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి సముద్ర తాజాగా రవి జంగు హీరోగా ప్రీతి కొంగన హీరోయిన్ గా శివమహాతేజ ఫిలిమ్స్, వి.సముద్ర మూవీస్ బ్యానర్లు పై విజయలక్ష్మీ సమర్పణలో వి.సాయి అరుణ్ కుమార్ నిర్మాతగా “వరదరాజు గోవిందం” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కు సిద్ధం అవుతోంది. కాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం జూన్ 9న ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో సుమన్, నటుడు శుభలేఖ సుధాకర్, హీరో రవి జంగు, హీరోయిన్ ప్రీతి కొంగన, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహరావు, ముప్పలనేని శివ, చంద్రమహేష్, రవికుమార్ చౌదరి, శివనాగు, నగేష్ నారదాసి, గోసంగి సుబ్బారావు, అమ్మరాజశేఖర్ నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, ఛాంబర్ కార్యదర్శి కె.యల్. దామోదర ప్రసాద్, నిర్మాతలు కేకే రాధామోహన్, డిఎస్ రావు, శోభారాణి, నటులు దాసన్న, ఖదీర్, జోహార్, సంగీత దర్శకుడు డా. రవి శంకర్, కెమెరామెన్ శ్రీ వెంకట్, కో-ప్రొడ్యూసర్స్ శ్రీహరి తుమ్మెటి, జింఖాన కోటేశ్వరావు, తదితరులు పాల్గొనగా .. అనంతరం దర్శకులంతా కలిసి ‘వరదరాజు గోవిందం’ మోషన్ పోస్టర్ లాంచ్ చేయగా… నిర్మాతలందరూ కలిసి టీజర్ ను రిలీజ్ చేశారు.
దర్శక నిర్మాత వి. సముద్ర మాట్లాడుతూ..  కృష్ణుడు బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందించాం.  యన్టీఆర్, రవితేజ లాగా హీరో రవి జంగు ఫుల్ ఎనర్జిటిక్ గా చేశాడు. ఈ సినిమా తనకి మంచి బ్రేక్ అవుతుంది. హీరోయిన్ ప్రీతి అద్భుతంగా చేసింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు వారందరికీ నా ధన్యవాదాలు.  చాలా గొప్ప కథ ఇది.నా కెరియర్ లో సింహరాశి, శివరామరాజు, ఎవడైతే నాకేంటి ఎంత పెద్ద హిట్ అయ్యాయో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. అన్నారు.
హీరో సుమన్ మాట్లాడుతూ..  ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరు సముద్ర మీద ప్రేమతో వచ్చారు. అందరూ సినిమా హిట్ అవ్వాలని దీవించారు. గ్యారెంటీగా హిట్ అవుతుంది. ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాను. అలుపెరగని శ్రామికుడిలా సముద్ర ఎప్పుడూ సెట్లో నవ్వుతూ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. హీరో రవి హీరోయిన్ ప్రీతి బ్యూటిఫుల్ గా చేశారు.  కాంతారా, హనుమాన్ తరహాలోనే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అన్నారు.
హీరో రవి జంగు మాట్లాడుతూ.. ” హిందీ, హార్యాని, అస్సాంలలో మూవీస్ చేశాను. తెలుగులో సినిమా చేయాలని నా డ్రీమ్. సముద్ర గారు నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా హీరోగా నాకు మంచి బ్రేక్ అవుతుంది.. అన్నారు.  హీరోయిన్ ప్రీతి కొంగన మాట్లాడుతూ..” ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ చేశాను. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన సముద్ర గారికి థాంక్స్.. అన్నారు.
దర్శకులంతా మాట్లాడుతూ.. వరదరాజు గోవిందం సినిమా టీజర్ చాలా బాగుంది.. సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. సముద్ర చాలా కష్టపడి ఈ చిత్రం తీశాడు.. అందరికీ ఈ సినిమా  మంచి బ్రేక్ అవ్వాలి అని కోరుకున్నారు..