వారు మారారు .. మనమే మారాలి !

‘గురు’ మార్చ్ 31న రిలీజ్ అవుతున్న సందర్భంగా విక్టరీ వెంకటేష్  మీడియా తో ముచ్చటించారు.  ఆ విశేషాలు ….

ఆ టైంలో ఈ సినిమా వచ్చింది

నటుడిగా ఓ క్రమ శిక్షణతో ప్రతీ రోజు కష్టపడి పని చేయడం నా అలవాటు. నిజానికి ‘బాబు బంగారం’ తరువాత మరో డిఫరెంట్ సినిమా చేయాలనుకున్న  టైంలో ఈ సినిమా వచ్చింది. నా వయసుకి సరిపడే క్యారెక్టర్, పైగా ఆల్రెడీ ఫిక్స్ అయిన స్క్రిప్ట్ కాబట్టి వెంటనే స్టార్ట్ చేసేసా..

నాకో ఛాలెంజ్

నిజానికి ‘గురు’ నాకో ఛాలెంజ్ లాంటి సినిమా.. స్పోర్ట్స్ బేస్డ్ స్టోరీ కాబట్టి ట్రైనర్ గా కనిపించడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నా. 6 నెలల పాటు బాక్సింగ్ లో శిక్షణ తీసుకోవడంతో పాటు బాడీ కూడా బిల్డ్ చేసి ఆ క్యారెక్టర్ కి తగ్గుట్టు లుక్ ఛేంజ్ చేశా. సహజంగా స్కూల్ లో పి.టీ మాస్టర్, కోచ్ లు ఎలా అరుస్తారో.. ఎలాంటి స్పీచ్ లు ఇస్తారో సినిమాలో అదే చేశా..

అప్పుడు చేయలేక పోయా

నిజానికి ఈ సినిమా నేనెప్పుడో చేయాలి. సుధా ఈ కథ ముందుగా నాకే చెప్పారు. కథ బాగా నచ్చింది కానీ కాస్త హెల్త్ బాగోకపోవడం వల్ల అప్పుడు కుదరలేదు. ‘సాలా ఖదూస్’ సినిమా రిలీజ్ కి ముందే చూసా.  చాలా నచ్చింది.  సుధ  నాకు చెప్పింది చెప్పినట్లే తెరకెక్కించారు. చూసిన వెంటనే తెలుగు లో చేయడానికి డిసైడ్ అయిపోయా…

ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది

నిజానికి ఓ గురు శిష్యుల మధ్య ఉండే కెమిస్ట్రీ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఈ సినిమాలో నాకు రితిక కి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేస్తాయి. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది..

చాలా ఫ్రెష్ గా అనిపించాయి

ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ అందించిన ట్యూన్స్ చాలా ఫ్రెష్ గా అనిపించాయి. ‘జింగిడి జింగిడి’ ట్యూన్ వినగానే బాగా హిట్ అవుతుందని అనుకున్నా.. ఆ సాంగ్ నేనే పాడాల్సి వస్తుందనుకోలేదు. ఆ సాంగ్ పాడమని అడగగానే అవసరమా అనుకున్న కానీ ఆ సాంగ్ లో వర్డ్స్ కాస్త మిస్టేక్స్ అయిన పెద్దగా ఎఫెక్ట్ ఉండదని ఆడియన్స్ కూడా కొత్తగా ఫీల్ అవుతారని ఒకే చెప్పి పాడాను. రీసెంట్ గా ఎవరో చెప్పారు ట్రెండ్ ఏదో అవుతుందని అది నిజమో కాదో నాకైతే తెలియదు..

అది తెలిస్తే ఇంకేం ఉండదు

నిజానికి మిస్టేక్స్ అందరూ  చేస్తూంటారు. నేను కూడా కొన్ని సినిమాల విషయం లో కొన్ని మిస్టేక్స్ చేశాను. నిజానికి మనం చేసేది మిస్టేక్స్ అని తెలిస్తే ఇంకెవ్వరు మిస్టేక్స్ చేయరు..  అప్పుడప్పుడు అవి మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. అలా కొన్ని మిస్టేక్స్ వల్ల కొన్ని సినిమాలు అపజయాలు అవుతుంటాయి.. నేనెప్పుడూ జరిగిన దాని గురించి పెద్దగా పట్టించుకోను ప్రస్తుతం చేసే పనిలో మళ్ళీ మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటా అంతే..

వాళ్ళు మారారు

నిజానికి మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడో మారిపోయారు మారాల్సిందే మనమే. డిఫరెంట్ సినిమాలను కొత్త కథలను ఏక్సెప్ట్ చేస్తున్నారు. ‘దృశ్యం’ విషయంలో తెలుగు ఆడియన్స్ ఈ సినిమా ఆక్సెప్ట్ చేస్తారా? అని కామెంట్స్ వినిపించాయి కానీ ఆ సినిమాను ఫామిలీ ఆడియన్స్ తో పాటు అందరు చూసి సక్సెస్ చేశారు… ఇతర భాషల్లో ఇప్పటికే స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు కొత్త సబ్జెక్ట్ సినిమాలు మంచి విజయాలు అందుకుంటున్నాయి. ఎమోషన్ కనెక్ట్ అయితే ఎలాంటి సినిమా అయిన చూస్తారని నా ఫీలింగ్..

నేను ఆ టైప్ కాదు

నిజానికి స్క్రిప్ట్ చెప్పే టప్పుడు వాళ్ళని కాస్త నెగ్లెట్ చేయడం స్క్రిప్ట్ విన్నాక వాళ్ళకి ఆన్సర్ ఇవ్వకుండా నెలలు తిప్పించుకోవడం నాకు నచ్చదు. బేసిక్ గా నేను ఆ టైప్ కాదు. స్క్రిప్ట్ చెప్పేటప్పుడు శ్రద్దగా వింటా.. ఆ టైంలో ఎలాంటి కామెంట్స్ చేయను. స్క్రిప్ట్ పూర్తిగా విన్నాక మాత్రం హానెస్టీ గా నా ఒపీనియన్ చెప్పేస్తా.. ఆ తరువాత వాళ్ల టైం వెస్ట్ చేయడం నాకిష్టం ఉండదు..

అది మంచిది కాదు

ప్రెజెంట్ టాలీవుడ్ లో ప్రొడక్షన్ వాల్యూస్ బాగా పెరిగాయి. నిజానికి అది మంచిది కాదనే అంటా. స్టార్స్ రెమ్యూనరేషన్ పెరగడం, భారీ లొకేషన్స్ , ఇతర అనవసర ఖర్చు వల్ల కాస్త ప్రొడక్షన్ ఖర్చు ఎక్కువవుతుంది. కాస్త కంట్రోల్ చేయగలిగితే నిర్మాత కి కాస్త భారం తగ్గుతుంది..

ప్రొడక్షన్ హ్యాండిల్ చేశా

నిజానికి హీరో తరువాత నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది నిర్మాతగానే.. ‘ముందడుగు’ సినిమా నుంచే ప్రొడక్షన్ భాద్యతలు తీసుకొని ఆ సినిమాకి ఓ నిర్మాతగా వర్క్ చేశా.. ఆ టైం లోనే ప్రొడక్షన్ గురించి మొత్తం తెలుసుకున్నా…

సరైన కథ దొరకడం లేదు

ఎప్పటి నుంచో ‘వివేకానంద’ మీద సినిమా చేయాలనుకుంటున్నా.. కానీ దానికి సరైన కథ, దర్శకుడు ఇంకా నా వరకు రాలేదు. వస్తే కచ్చితంగా చేస్తా..

ఆవిషయంలో చాలా హ్యాపీ

రానా ‘బాహుబలి’,’ఘాజీ’ తో ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదగడం డిఫరెంట్ క్యారెక్టర్, సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీ గా ఉంది. 17 ఏళ్ల వయసులోనే వి.ఎఫ్.ఎక్స్ వర్క్ నేర్చుకున్నాడు. త్వరలో రానున్న’బాహుబలి 2′, ‘నేనే రాజు నేనే మంత్రి’ తో నటుడిగా ఇంకా మెప్పిస్తాడు.

ఆ సినిమా ఉంటుంది

‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ సినిమా ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి. నిజానికి అది ఆగిపోలేదు. ఆ సినిమా కి ఇంకా సరిగ్గా ఏం కుదరలేదు. కానీ కచ్చితంగా ఆ సినిమా ఉంటుంది. ఎప్పుడనేది మాత్రం ఇప్పుడు చెప్పలేను.

ఇంకా డిసైడ్ అవ్వలేదు

నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. చూద్దాం నేనెను అనౌన్స్ చేస్తే ఏది జరగట్లేదు ఎందుకో నా విషయంలో చెప్పిన పనులు ఏం జరగడం లేదు.. అందుకే ఇక నుంచి కొన్ని చెప్పదలుచుకోలేదు.. కొన్ని కథలు రెడీ అవుతున్నాయి.. కాస్త టైం తీసుకొని  నెక్స్ట్ సినిమా ఏంటనేది చెప్తా…