‘నారప్ప’ షూటింగ్ తిరిగి ప్రారంభించారు !

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా డి. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న చిత్రం ‘నారప్ప’. ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి  చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. లాక్ డౌన్‌కి ముందే అరవై రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ రీసెంట్‌గా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హైద‌రాబాద్ ప‌రిస‌ర‌ప్రాంతాల్లో షూటింగ్‌ పునఃప్రారంభించింది.

అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో  ‘నారప్పస‌ షూటింగ్ ప్రారంభించి తమిళ నాడులోని కురుమలై మ‌రియు తిరిచందూర్ సమీపంలో ఉన్న తెరికాడు రెడ్ డెసర్ట్ లో కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేశాం. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా నిలిపివేసిన షూటింగ్‌ని త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ  హైద‌రాబాద్‌లో తిరిగి ప్రారంభించాం. కీలక సన్నివేశాలు, క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో  80 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. మిగిలిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను పూర్తిచేసి త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌స్తాం” అని నిర్మాత‌లు సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను చెప్పారు.

ఈ చిత్రానికి కథ: వెట్రిమారన్‌, స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌