లాంఛ‌నంగా ప్రారంభ‌మైన విజయ్ దేవరకొండ `హీరో`

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం `హీరో` ఆదివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఆనంద్ అన్నామ‌లై ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ హీరో హీరోయిన్‌ల‌పై క్లాప్ కొట్టారు. అలాగే ద‌ర్శ‌కుడికి స్క్రిప్ట్‌ను అందించారు. ఎమ్మెల్యే ర‌వికుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో `హీరో` సినిమా తెర‌కెక్క‌నుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ తొలిసారి ఇలాంటి డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీలో న‌టిస్తున్నారు. ‘పేట్ట’ ఫేమ్ మాళ‌వికా మోహ‌న‌న్ ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమ‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతున్నారు. ప్ర‌దీప్‌కుమార్ సంగీతం అందించ‌బోయే ఈ చిత్రానికి ముర‌ళి గోవింద రాజులు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీనటులు: 
విజ‌య్ దేవ‌ర‌కొండ, మాళ‌వికా మోహ‌న‌న్‌
దిగంత్ మ‌చాలే,వెన్నెల కిషోర్‌,శ‌ర‌ణ్ శ‌క్తి
రాజా కృష్ణ‌మూర్తి(కిట్టి),జాన్ ఎడ‌త‌ట్టిల్‌

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  ఆనంద్ అన్నామ‌లై
నిర్మాణం:  మైత్రీ మూవీ మేక‌ర్స్‌,సి.ఇ.ఒ:  చెర్రీ
మ్యూజిక్‌: ప‌్ర‌దీప్ కుమార్‌,సినిమాటోగ్ర‌ఫీ:  ముర‌ళి గోవింద‌రాజులు
ఎడిట‌ర్‌:  ఆనంద్ అన్నామ‌లై,ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  మౌనికా, రామ‌కృష్ణ‌
స్టంట్స్‌:  శంక‌ర్ ఉయ్యాల‌,వి.ఎఫ్‌.ఎక్స్‌:  యుగంధ‌ర్‌,ఆప‌రేటివ్ కెమెరామెన్‌: ప‌్ర‌దీప్‌
రేస్ క‌న్స‌ల్టెంట్‌: ర‌జ‌నీ కృష్ణ‌న్‌,సౌండ్ డిజైన్‌: అంథోని బి. జ‌య‌రూబ‌న్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ఇన్‌ఫాంటినా ఫ్లోరా, హ‌ర్మ‌న్ కౌర్‌,ప్రొడక్ష‌న్ కంట్రోల‌ర్‌: సుబ్ర‌మ‌ణ్యం కె.వి.వి