యాష్ ‌, శ్రీనిధి శెట్టి ‘కె.జి.ఎఫ్‌’ ఫస్ట్‌లుక్‌

కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలింస్‌ సంస్థ తెలుగు, కన్నడ,తమిళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న చిత్రం ‘కె.జి.ఎఫ్‌’.కన్నడంలో ‘రామాచారి’, ‘మాస్టర్‌ ఫీస్‌’, ‘గజికేశరి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ ఇచ్చిన ‘రాకింగ్‌ స్టార్‌’ యష్‌ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం మిల్సీబ్యూటీ తమన్న ఓ ప్రత్యేక పాటలో చేయడం జరిగింది.గతంలో ‘ఉగ్రం’ వంటి సూపర్‌హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర సహ నిర్మాత కైకాల రామారావు మాట్లాడుతూ… ”షూటింగ్‌ మొత్తం పూర్తయిన సినిమా ప్రస్తుతం రీ-రికార్డింగ్‌ జరుపుకుంటుంది. బుధవారం సాయంత్రం విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. థియేటర్‌ ట్రైలర్‌ అక్టోబరు 14న, చిత్రాన్ని నవంబరు 16న తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం” అన్నారు.
చిత్ర దర్శకులు ప్రశాంత్‌నీల్‌ మాట్లాడుతూ… ”అమెరికాకు రష్యాకు మధ్య జరిగిన యుద్దం సమయంలో నిత్యవసరాల వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ముఖ్యంగా బంగారం ధర పెరగడంతో మనుషులలో అత్యాశ పెరిగింది. అదే సమయంలో ‘కె.జి.ఎఫ్‌’ (కోలార్ బంగారు గనులు) భారత దేశంలోనే అతిపెద్ద బంగారు గని,అది ఒక్క మనిషి చేతిలోకి వెళితే ఏ మవుతుంది అనే ఇతి వృత్తంతో ఈ సినిమా ఫస్ట్‌ పార్టుగా రూపొందిస్తున్నాం” అన్నారు.
చిత్ర నిర్మాత విజయ్‌ విజయ్‌ కిరగందూర్ మాట్లాడుతూ… ”కోలార్‌ బంగారు గనుల వద్ద భారీ సెట్స్‌ వేసి సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది, ఈ సినిమాలోని యాక్షన్‌ దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.70వ దశాబ్ధకంలో జరిగిన అప్పటి మాఫియా నేపధ్యంలో జరిగిన కథతో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాలోని తమన్నా పాట ప్రత్యేక హైలైట్‌గా నిలుస్తుందని” అన్నారు.
 
‘రాకింగ్ స్టార్’ యాష్ ‌, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనంత్‌నాగ్‌, అచ్యుత్‌రావు, అయ్యప్ప .పి.శర్మ తదితరులు నటిస్తున్నారు. తమన్న ప్రత్యేక పాటలో నటించిన ఈ చిత్రానికి కెమెరా: భువన్‌ గౌడ, ఎడిటింగ్‌: శ్రీకాంత్‌, సంగీతం:రవి భసూర్‌, పాటలు:రామజోగయ్య శాస్ట్రి, మాటలు:హనుమాన్‌ చౌదరి, ఆర్ట్‌:శివకుమార్‌, పి.ఆర్.ఓ: సురేష్ కొండేటి, కొరియోగ్రఫీ:జానీ, ఫైట్‌ మాస్టర్‌:అన్‌ బరివు-విక్రమ్‌, సహ నిర్మాత:కైకాల రామారావు, నిర్మాత:విజయ్‌ కిరగందూర్, సమర్పణ:కైకాల సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ప్రశాంత్‌ నీల్‌.