మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ నితిన్‌ పెళ్లి ఫిక్స్‌

హీరోగా ఎంట్రీ ఇచ్చి 17 సంవ్సరాలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు నితిన్‌ పెళ్లి విషయం తేలలేదు. నితిన్ హను రాఘవపూడి ‘లై’ సినిమా చేస్తున్నప్పుడు ఆ చిత్ర కధానాయిక మేఘ ఆకాష్ తో ప్రేమలో పడ్డాడని అప్పట్లో వార్తలొచ్చాయి. టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్స్‌లో నితిన్‌ ఒకరు. తేజ ‘జయం’ తో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు నితిన్‌. తాజాగా నితిన్‌ త్వరలో ఓ ఇంటివాడు అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్‌కు పెళ్లి ఫిక్స్‌ అయినట్లు.. ఏప్రిల్‌ 16న శాలిని అనే అమ్మాయితో నితిన్‌ జరగబోతున్నట్లు వార్త. అయితే నితిన్‌ పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహన్ని చేసుకుంటున్నాడు. యూకేలో ఎంబీఏ చేసిన శాలినితో నితిన్‌ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడట. వీరి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు తెలియజేసి పెళ్లికి ఒప్పించారట.
ఇప్పటికే పెళ్లి పనులను కూడా ప్రారంభించినట్లు సమాచారం. పెళ్లి పనులన్నీ నిర్మాత, నితిన్ సోదరి నిఖిత చూసుకుంటుందట.
కాగా నితిన్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోనున్నారు. దుబాయ్‌లోని ప్యాలసో వెర్సేస్‌ హోటల్‌లో వైభవంగా వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అనంతరం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఇవ్వనున్నట్టు సమాచారం.
నితిన్‌ ప్రస్తుతం ‘చలో’ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమాలో నటిస్తున్నాడు. రష్మిక మందన్ననాయికగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.