‘ఫిల్మ్‌ ఎక్సలెన్సీ-టీవీ అవార్డుల’ ప్రదానోత్సవం !

‘యువకళావాహిని’-‘నాట్స్‌’ ఆధ్వర్యంలో ‘ఫిల్మ్‌ ఎక్సలెన్సీ-టీవీ అవార్డుల’ ప్రదానోత్సవం ఆగస్ట్ 9న ప్రసాద్ ల్యాబ్ లో కనులపండువగా జరిగింది. ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజుకు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన  కృష్ణంరాజు తరఫున ఆయన కుమార్తెలు  సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి పురస్కారాన్నిఅందుకున్నారు. ఏపీఈఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ జి.భవానీప్రసాద్‌, ‘నాట్స్‌’ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, స్వచ్ఛ ఆంధ్ర మిషన్‌, నాట్స్‌ ప్రచారకర్త, అవార్డుల కమిటీ అధ్యక్షుడు,’మాస్ట్రో’ గజల్‌ శ్రీనివాస్‌, ‘అక్కినేని నాటక పరిషత్ అధ్యక్షుడు’ సారిపల్లి కొండలరావు ఈ అవార్డుల  ప్రదానం చేశారు.

నటుడు సాయిచంద్, కవి రామజోగయ్య శాస్త్రి ,రచయిత బుర్రా సాయిమాధవ్  ఫిలిం ఎక్సలెన్సీ అవార్డులు అందుకున్నారు . టి .వి .రంగం నుండి నటుడు ప్రదీప్ ,నటి శృతి లకు జీవిత కాల విశేష పురస్కారాలు అందజేశారు . ఇంకా వివిధ విభాగాల్లో టీవి ఫీచర్స్,సీరియల్స్,నటీ నటులకు  అవార్డుల  ప్రదానం చేశారు.
‘నాట్స్’  ప్రతినిధులు  శ్రీనివాస్ గుత్తికొండ, బి. ప్రసాద్ , సినీనటులు జి .వి .నారాయణరావు, సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ, డి .జె .వసంత్ ,ఖయ్యూమ్, రామరాజు ఈ సభలో పాల్గొన్నారు .