సినీ దిగ్గజ గేయకర్త సినారె వైభవం, సినారె గేయధార !

మహాకవి, మంచి మనిషి సినారె అని తమిళనాడు పూర్వ గవర్నర్‌,ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్య మంత్రి రోశయ్య కొనియాడారు. సినారె లేని రవీంద్రభారతిని ఊహించుకోలేమన్నారు . ఆయన మనల్ని అనాధ లుగా చేసి వెళ్లిపోయారని అన్నారు. ‘యువకళావాహిని’ ఆధ్వర్యంలో “సినీ దిగ్గజ గేయకర్త సినారె వైభవం” కార్యక్రమాన్ని జూన్ 27 న  రవీంద్రభారతిలో నిర్వహించారు. రోశయ్య మాట్లాడుతూ… సినారె కవిత్వం పండితులకే కాదూ.. ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేదిగా ఉందన్నారు. సినారె వంటి కవి, మనిషి ని  మళ్లీ చూస్తామని నేను మాత్రం అనుకోవడం లేదన్నారు.

ఈ సందర్భంగా…. గాయనీ గాయకులు శరత్‌చంద్ర, వి.కె.దుర్గ 84 గీతాలతో ప్రత్యేకంగా రూపొందించిన ‘సినారె సినీ గేయధార’ను సమర్పించారు. డా.పాలకుర్తి మధుసూదనరావు, డా. కే.వీ.కృష్ణకుమారి, డా.గజల్‌ శ్రీనివాస్‌, డా.శరత్‌ జ్యోత్స్నారాణి, జనార్దన్‌ మహర్షి, గోవిందరాజు రామకృష్ణరావు, సుధామ, డా.జుర్రు చెన్నయ్య, డా.వి.ఎల్‌ నరసింహారావు,’పద్మశ్రీ పిక్చర్స్’ పద్మావతి దేవి ,గుండుహనుమంతరావు సినారెతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ‘యువకళావాహిని’ అధ్యక్షులు వై.కె.నాగేశ్వరరావు స్వాగతం పలికారు.