ప్రతిష్టాత్మక 2019 గ్రామీ అవార్డుల ప్రదానం !

2019 గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం… ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. సింగర్ అలీసియా కీస్ ఈ షోను హోస్ట్ చేసింది. ఈ షోలో డయానా రాస్, మైలీ సైరస్, పోస్ట్ మలోన్, డాలీ పార్టాన్, జానెల్ మోనే, షాన్ మెండిస్, కాటీ పెర్రీ, రిక్కీ మార్టిన్‌లాంటి స్టార్ సింగర్స్ పెర్ఫామ్ చేశారు. ఇక ఈసారి నాలుగు అత్యుత్తమ అవార్డు కేటగిరీలైన ఆల్బమ్, రికార్డ్, సాంగ్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ న్యూ ఆర్టిస్ట్‌లలో ఐదుకు బదులుగా ఎనిమిది నామినీలను ప్రకటించడం విశేషం. లేడీ గాగా రెండు అవార్డులను అందుకోగా.. గత వారం ఈ అవార్డు ప్రొడ్యూసర్స్‌తో విభేదాల వల్ల సెర్మనీకి హాజరు కాని అరియానా గ్రాండె తన తొలి గ్రామీని గెలుచుకుంది.
 
28వ గ్రామీ అవార్డు గెలిచిన క్విన్సీ జోన్స్‌
అమెరికా మ్యూజిక్ డైర‌క్ట‌ర్ క్విన్సీ జోన్స్‌.. గ్రామీ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయం లిఖించాడు. మ్యూజిక్‌ కెరీర్‌లో అత‌ను 28వ సారి గ్రామీ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఏడాది కూడా అత‌ను త‌న ఖాతాలో ఓ అవార్డును వేసుకున్నాడు. బెస్ట్ మ్యూజిక్ ఫిల్మ్ క్యాట‌గిరీలో ఈ సారి అత‌ను అవార్డును గెలుచుకున్నాడు. 85 ఏళ్ల లెజండ‌రీ మ్యూజిక్ మాస్ట‌ర్ క్విన్సీ జోన్స్‌.. ఎక్కువ సంఖ్య‌లో గ్రామీలు అందుకున్న మొద‌టి పాప్‌స్టార్‌గా నిలిచాడు. క్విన్సీ గ‌తంలో మైఖేల్ జాక్స‌న్‌తోనూ ప‌నిచేశాడు. 70 ఏళ్ల కెరీర్‌లో అత‌ను ప‌ది క్యాట‌గిరీల్లో గ్రామీ గెలిచాడు. క్విన్స్ గ్రామీ అందుకున్న ఫోటోను ఏఆర్ రెహ్మాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. సంగీతం ఎప్పుడూ మ‌న‌ల్ని ముందుకు న‌డిపిస్తుంద‌ని భావిస్తా..అని రెహ్మాన్ ఆ ఫోటోకు క్యాప్ష‌న్ ఇచ్చారు. ఏఆర్‌. రెహ్మాన్ ఆ వేడుక‌లో పాల్గొన్నారు. ఆయ‌న త‌న కూతురు ర‌హీమాతో క‌లిసి ఈవెంట్‌కు వెళ్లారు. 2009లో స్ల‌మ్‌డాగ్ మిలియ‌నీర్ చిత్రానికి రెహ్మాన్‌కు గ్రామీ అవార్డు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. బ్లాక్ అండ్ గ్రే సూట్‌లో రెహ్మాన్ క‌నిపించాడు. గ్రామీ అవార్డు కార్య‌క్ర‌మానికి వెళ్లిన సంద‌ర్భంగా ఓ ఫోటోను ట్వీట్ చేశారు. లండ‌న్‌కు చెందిన ప్ర‌శాంత్ మిస్త్రీ, న్యూయార్క్‌కు చెందిన ఫాల్గుణి షా, అమెరికాకు చెందిన స‌త్నం కౌర్‌లు.. రెహ్మాన్‌తో క‌లిసి ఫోటో దిగారు.
‘సాంగ్ ఆఫ్ ది ఇయర్’
అమెరికాలో వ‌ర్ణ‌వివ‌క్ష ఎక్కువే. ఆ నేప‌థ్యంతో రిలీజైన ఓ పాప్ సాంగ్ అక్క‌డ సెన్షేష‌న్ క్రియేట్ చేసింది. రాజ‌కీయంగా అది దుమారం రేపింది. ‘దిస్ ఈజ్ అమెరికా’ అన్న ఆ సాంగ్‌.. ‘సాంగ్ ఆఫ్ ది ఇయర్’ గ్రామీ అవార్డును త‌న ఖాతాలో వేసుకున్న‌ది. బెస్ట్ మ్యూజిక్ వీడియో అవార్డును కైవ‌సం చేసుకున్న‌ది. యాక్ట‌ర్ డోనాల్డ్ గ్లోవ‌ర్(చైల్డిస్ గాంబినో) దీన్ని రూపొందించాడు. వ‌ర్ణ‌వివ‌క్ష‌తో పాటు అమెరికాలో ఉన్న తుపాకీ సంస్కృతిని ఈ సాంగ్‌లో చూపించారు.

The complete list of winners:

Album Of The Year — Golden Hour, Kacey Musgraves
 
Record Of The Year — “This Is America,” Childish Gambino
 
Best New Artist — Dua Lipa
 
Best Rap Album — Invasion Of Privacy, Cardi B
 
Best R&B Album Winner — H.E.R., H.E.R.
 
Best Rap Song — “God’s Plan,” Drake
 
Best Country Album — Golden Hour, Kacey Musgraves
 
Song Of The Year — “This Is America,” Childish Gambino
 
Best Pop Duo/Group Performance — “Shallow,” Lady Gaga & Bradley Cooper
 
Producer Of The Year, Non-Classical — Pharrell Williams
 
Best Rap/Sung Performance — “This Is America,” Childish Gambino
 
Best Rap Performance — King’s Dead, Kendrick Lamar, Jay Rock, Future & James Blake / Bubblin, Anderson .Paak
 
Best Rock Album — From The Fires, Greta Van Fleet
 
Best Rock Song — “Masseduction” St. Vincent
 
Best Metal Performance — Electric Messiah, High On Fire
 
Best Rock Performance — When Bad Does Good, Chris Cornell
 
Best Urban Contemporary Album — Everything Is Love, The Carters
 
Best R&B Song — “Boo’d Up,” Ella Mai
 
Best Traditional R&B Performance — Bet Ain’t Worth The Hand, Leon Bridges / How Deep Is Your Love, Pj Morton Featuring Yebba
 
Best R&B Performance — Best Part H.E.R. Featuring Daniel Caesar
 
Best Latin Jazz Album — Back To The Sunset, Dafnis Prieto Big Band
 
Best Large Jazz Ensemble Album — American Dreamers: Voices Of Hope, Music Of Freedom, John Daversa Big Band Featuring Daca Artists
 
Best Jazz Instrumental Album — Emanon, The Wayne Shorter Quartet