ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో సంచలనం రాయల్‌ ర్యాప్చీ ‘టి.బి.డి’

????????????????????????????????????

కేవలం రూ 10 రూపాయలకి నెలవారి సబ్ స్క్రిప్షన్ రుసుముతో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో సంచలనం దుబాయ్ దేశానికి చెందిన రాయల్‌ ర్యాప్చీ వారి ‘టి.బి.డి’ ఓటీటీ ఇండియాలో రాయల్‌ ర్యాప్చీ ప్రారంభించిన టిబిడి డిజిటల్‌ ఓటీటీ

రోజు రోజుకూ పెరుగుతున్న సాంకేతికతతో ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా సినిమా రంగం వేగంగా అడుగులు వేస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ వెండితెర నుంచి బుల్లితెరకు అక్కడి నుంచి మొబైల్‌ ఫోన్‌లకు వేగంగా విస్తరిస్తోంది. దీంతో అనేక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ ప్రేక్షకులను అలరించటానికి అనేక సినిమాలను, వెబ్‌సిరీస్‌లను, ఇతర కార్యక్రమాలను ప్రసారం చేస్తూ దూసుకు పోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ ఓటీటీ రంగంలో సంచలనం సృష్టించడానికి ‘టీబీడీ’ (త్రిభాణధారి) ఓటీటీ ద్వారా అడుగుపెట్టింది దుబాయ్‌ కేంద్రంగా నడుస్తున్న రాయల్‌ ర్యాప్చీ సంస్థ. ఈ సంస్థ ఇటీవలే దుబాయ్‌లో ఘనంగా లాంచ్‌ అయిన ‘టీబీడీ’ ఓటీటీ ఇప్పుడు భారతదేశంలో రూట్‌ లెవల్‌కు విస్తరించటానికి ప్లాన్‌ చేసుకుంది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌క్లబ్‌లో లోగో లాంచ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంది. ఈ కార్యక్రమానికి సంస్థ ఫౌండర్‌, ఎండీ ధరమ్‌ గుప్తా, సీఈఓ సునీల్‌ భోజ్వానీ, సౌత్‌ ఇండియా సీఈఓలు ప్రముఖ నటులు, నిర్మాత డి.యస్‌.రావు, ప్రముఖ దర్శకుడు వి. సముద్రలతో పాటు దర్శకులు వి.యన్‌. ఆదిత్య, చంద్రమహేష్‌, ఇ. సత్తిబాబు, శివనాగు, డిజిక్వెస్ట్‌ అధినేత బసిరెడ్డి, ‘సంతోషం’ అధినేత సురేష్‌ కొండేటి, నటుడు దాసన్నలతో పాటు పలువురు నిర్మాతలు, చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్‌ గారి చేతులు మీదుగా ఈ యాప్‌ లాంచ్‌ ఘనంగా జరిగింది.

‘టీబీడీ’ ఫౌండర్‌, ఎండీ ధరమ్‌గుప్తా మాట్లాడుతూ…
టిబిడి అనేది భారతీయ మూలాలకు విస్తరించాలనేది మా ఆకాంక్ష. ఇందులో మన దేశీ కంటెంట్‌ మాత్రమే ఉంటుంది. అందులోనూ కుటుంబం అంతా కూర్చుని చూసే వల్గారిటీలేని కంటెంట్‌ మాత్రమే ఉంటుంది. సెక్స్‌ కంటెంట్‌ తప్ప అన్నీ ఉంటాయి. మన దేశంలోని అన్ని భాషల సినిమాలు, అవి ఎంత పాతదైనా, కొత్తవైనా తప్పకుండా మమ్మల్ని అప్రోచ్‌ అవ్వొచ్చు. ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇది ప్రపంచం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ చరిత్రలో నెవర్‌ బిఫోర్‌గా చెప్పాలి. తెలుగు పరిశ్రమ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎదిగింది. నాకు హైదరాబాద్‌ అంటే చాలా ఇష్టం. సౌత్‌ సీఈఓలుగా డి.యస్‌.రావుగారు, సముద్ర గారు వంటి టాలెంటెడ్‌ పర్సన్స్‌ ఉండటం మాకు చాలా గర్వకారణం. చిత్ర పరిశ్రమతో వారికి ఉన్న సుదీర్ఘ అనుభవం మా టిబిడి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఓటీటీ రంగంలో ఇప్పటికే చాలా ఫ్లాట్‌ఫామ్స్‌ ఉన్నప్పటికీ ఇంకా చాలా స్పేస్‌ ఉంది. మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించగలిగితే గట్టిగా నిలబడతాం. మేం మంచి కంటెంట్‌ను మాత్రమే నమ్ముకున్నాం. మేం మా స్వంత కంటెంట్‌తో పాటు కొనుగోలు చేసిన కంటెంట్‌ను ప్రదర్శిస్తాం. చిన్న నిర్మాతలకు ఇక్కడ పెద్ద పీఠ వేస్తాం. పేమెంట్‌ విషయంలో కూడా చాలా ఖచ్చితంగా ఉంటాం. అందరినీ అలరిస్తూ సుదీర్ఘకాలం నిలబడటమే మా లక్ష్యం అన్నారు.

టిబిడి సౌత్‌ సీఈఓల్లో ఒకరైన డి.యస్‌. రావు మాట్లాడుతూ…
ఇక్కడికి విచ్చేసిన అందరికీ థ్యాంక్స్‌. 30 ఏళ్లుగా ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా ఎన్నో తీపి, చేదు అనుభవాలను చూశాను. ఓటీటీ బిజినెస్‌ విషయంలో చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓటీటీకి సినిమా అమ్ముదామనుకుంటే వారికి ఎవరిని కలవాలో, ఎలా అప్రోచ్‌ అవ్వాలో తెలియడం లేదు. ఇలాంటి టైమ్‌లో ఈ టిబిడి ఓటీటీ రావడం, దీనికి నేను సముద్రగారు బాధ్యులుగా ఉండటం హానర్‌గా ఫీలవుతున్నాను. గుప్తాగారితో ఇది అందరికీ అనుకూలంగా ఉండాలి అని చెప్పాను. ముందు పెద్ద పెద్ద అడుగులు వేయకుండా కమిట్‌ అయిన సినిమాల పేమెంట్‌ విషయంలో కరెక్ట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా అందరూ మనల్ని అప్రోచ్‌ అవుతారు అని కూడా చెప్పాను. చిన్న సినిమాలకు ఇది చక్కని వేదిక అని ఖచ్చితంగా చెపుతున్నా. తప్పకుండా దీన్ని టాప్‌రేంజ్‌లో నిలబెట్టటానికి సముద్రగారు, నేను శక్తివంచన లేకుండా కృషి చేస్తాం అన్నారు.

టిబిడి సౌత్‌ సీఈఓల్లో ఒకరైన వి. సముద్ర మాట్లాడుతూ…
ఇక్కడికి విచ్చేసిన అందరికీ మా టిబిడి తరపున కృతజ్ఞతలు. సౌత్‌ ఇండియాలో ఈ యాప్‌ లాంచ్‌కు మన తెలుగు పరిశ్రమను తొలిగా ఎంచుకున్నందుకు గుప్తా గారికి, సునీల్‌ గారికి థ్యాంక్స్‌. టిబిడి దుబాయ్‌ బేస్డ్‌గా ఉన్నప్పటికీ ప్రపంచమంతా ఈ టిబిడి పనిచేస్తుంది. రాబోయే కాలంలో పెద్ద ఓటీటీల్లో ఒకటి నిలబడుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. ఓటీటీ బిజినెస్‌ విషయంలో నిర్మాతలు ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నింటికీ చక్కని పరిష్కారం మా టిబిడి. నేను, డి.యస్‌. రావు గారు అనుక్షణం అందరికీ అందుబాటులో ఉంటాం. మంచి కంటెంట్‌ తయారు చేయండి. మేము మీకు సహాయపడతాము. టిబిడిని నెంబర్‌వన్‌గా చేయటానికి కష్టపడతాం. అన్ని లాంగ్వేజ్‌లలో చిన్న, పెద్ద సినిమాలతో పాటు, వెబ్‌సిరీస్‌లు, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌ను తీసుకుంటాం. ప్రాజెక్ట్‌లకు సంయుక్తంగా నిర్మించడంతో పాటు ఫైనాన్స్‌ కూడా చేస్తాం. త్వరలోనే ఆడియో రంగంలోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రస్తుతం నేను చేస్తున్న ‘దో కమీనే’ సినిమాను కూడా తీసుకున్నారు. మమ్మల్ని నమ్మి ఈ బాధ్యతను అప్పగించిన గుప్తా గారికి ధన్యవాదాలు.

ముఖ్య అతిథి కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ…
ఈ ఓటీటీ చిన్న, పెద్ద నిర్మాతలకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని నిర్మాతలు, దర్శకులు కూడా మంచి కంటెంట్‌ క్రియేషన్‌కు కృషి చేయాలి. అతి తక్కువ సబ్‌స్క్రిప్షన్‌తో అడుగు పెడుతున్న టిబిడి టీమ్‌లో భాగస్వాములైన అందరికీ నా శుభాకాంక్షలు అన్నారు.

దర్శకులు చంద్ర మహేష్‌గారు మాట్లాడుతూ…
టిబిడి అనేది మంచి సినిమాలకు కేరాఫ్‌గా, నిర్మాతలకు చక్కని ప్లాట్‌ఫామ్‌ అవుతుంది అనుకుంటున్నాను. మంచి టేస్ట్‌ ఉన్న సముద్రగారు సౌత్‌ సీఈఓగా ఉండటం వల్ల మంచి సినిమాలు, కంటెంట్‌ ఇందులో వస్తుందని ఆశిస్తున్నాను. ఆల్‌ది బెస్ట్‌ టు ఎంటైర్‌ టీమ్‌ అన్నారు.

దర్శకులు ఇ. సత్తిబాబు గారు మాట్లాడుతూ…
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ ఎన్ని వచ్చినా తెలుగులో అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది. ఈ టిబిడి వచ్చే సంవత్సరానికి నెంబర్‌ వన్‌గా నిలబడాలని కోరుకుంటూ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.

డిజిక్వెస్ట్‌ అధినేత బసిరెడ్డిగారు మాట్లాడుతూ…
ఈ ఓటీటీ కోసం పనిచేస్తున్న వారంతా మంచి హార్డ్‌వర్క్‌ పీపుల్‌. ఇది చాలామందికి చక్కని ఫ్లాట్‌ఫామ్‌ అవుతుందని ఆశిస్తున్నాను. పెద్ద ఎత్తున కాంపిటీషన్‌ ఉన్న ఈ రంగంలో అంతే స్థాయిలో అవకాశాలు కూడా ఉన్నాయి. చక్కని కంటెంట్‌తో వచ్చే చిన్న చిత్రాలకు ఇక్కడ అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాను. ఆల్‌ది బెస్ట్‌ అన్నారు.

సురేష్‌ కొండేటి మాట్లాడుతూ…
టిబిడి లాంటి ఫ్లాట్‌ఫామ్స్‌ ఇప్పుడు తెలుగు సినిమాకు చాలా అవసరం. ఈ కార్యక్రమానికి ఇంతమంది చిన్న నిర్మాతలు, దర్శకులు హాజరవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేటి చిన్న నిర్మాతలే రేపటి పెద్ద నిర్మాతలు అవుతారు. ఇంతకు ముందు శాటిలైట్‌ ఎలాగో ఇప్పుడు ఓటీటీ అనేది చాలా కీలకమైంది. ధరమ్‌ గుప్తా గారు ఈ ఓటీటీ ద్వారా అందరి సినిమాలు కొని ఎంకరేజ్‌ చేయాలని కోరుకుంటూ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు చంద్ర, సతీష్‌, సిరాజ్‌, జగదీష్‌, చంద్ర, ఆలీషా, దర్శకులు శివనాగు, దొరైరాజు, మల్లిఖార్జున్‌, నటుడు దాసన్నలతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.