భారీ ప్రైజ్‌మనీతో ‘ఏకాగ్రా ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్’

*భారీ ప్రైజ్‌మనీతో హైదరాబాద్‌లో ‘ఏకాగ్రా ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్’*
 *డిసెంబర్ 20-21 తేదీల్లో ప్రారంభం*
 *విజేతలకు ₹22,22,222 బహుమతి*
హైదరాబాద్: తెలంగాణలో మొట్టమొదటిసారిగా రూ. 22,22,222 నగదు బహుమతులతో కూడిన అతిపెద్ద ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్‌ను ఏకాగ్రా చెస్ అకాడమీ నిర్వహిస్తోంది. డిసెంబర్ 20,  21వ తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్  ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ రెండు రోజుల టోర్నమెంట్ జరగనుంది.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో..  ఏకాగ్రా ఇంటర్‌నేషనల్ చెస్ టోర్నమెంట్ వైస్ చైర్మన్, ప్రముఖ పాత్రికేయుడు, నంది అవార్డు గ్రహీత షరీఫ్ మహ్మద్ మాట్లాడుతూ – “తెలంగాణలో ఇంత పెద్ద ఓపెన్ రాపిడ్ టోర్నమెంట్ ఇదే తొలిసారి. మొత్తం రూ. 22,22,222 నగదు బహుమతులను విజేతలకు పంచుతాం” అని ప్రకటించారు.
సాధారణ ఆటగాళ్లకు ఎంట్రీ ఫీజు : రూ. 5,000 ఉంటుంది. గ్రాండ్ మాస్టర్లు, ఇంటర్నేషనల్ మాస్టర్లు, మహిళా GM & WIMలకు – ఉచిత ఎంట్రీ ఏర్పాటు చేశారు.  రిజిస్ట్రేషన్ చివరి తేదీ రూ. 5,000తో  డిసెంబర్ 15 వ‌ర‌కు ఉండ‌గా, ఆల‌స్య రుసుము రూ. 6,000తో – డిసెంబర్ 18 వ‌ర‌కు గ‌డువు ఉంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో www.ekagrachessacademy.com లో చేసుకోవ‌చ్చ‌ని, +91 79813 58105, +91 62646 46422, +91 78428 43999 నంబ‌ర్‌ల‌లో సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని నిర్వ‌హ‌కులు తెలిపారు.
ఇప్పటికే ప‌లువురు ప్రముఖ గ్రాండ్ మాస్టర్లు  నమోదు చేసుకున్నారు. ఇందులో ట్విల్ కోవు సెరిజ్ (నెదర్లాండ్స్),  సావ్‌చెంకో బోరిస్ (రష్యా), పెట్రోవ్ మారియన్ (బల్గేరియా), రాయ్ చౌదరి సప్తర్షి (ఇండియా) తదితరులు ఉన్నారు.
టోర్నమెంట్ డైరెక్టర్ గిరీష్ రెడ్డి మాట్లాడుతూ – “2020లో ఏకాగ్రా చెస్ అకాడమీ ప్రారంభించినప్పటి నుంచి వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాం. 2022లో నిర్వహించిన మా ఫిడే రేటెడ్ టోర్నమెంట్‌లో 1,300కు పైగా ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈసారి మరింత ఘనంగా నిర్వహిస్తున్నాం” అని తెలిపారు.
గిరీష్ మాట్లాడుతూ – “ఈ టోర్నమెంట్‌లో బాగా రాణించిన విద్యార్థులను ఏకాగ్రా చెస్ స్కాలర్‌షిప్ కార్యక్రమంలో ఎంపిక చేస్తాం అని చెప్పారు.
ఆర్గనైజయింగ్ కార్యదర్శి సౌమ్య జానూ మాట్లాడుతూ చెస్ ఆడటం ద్వారా ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, జ్ఞాపకశక్తి బాగా పెరుగుతాయి” అని పేర్కొన్నారు.
ప్రైమ్9 న్యూస్ ఛానెల్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆసక్తి కనబరుస్తోంది. తెలంగాణ చెస్ ఆటగాళ్లకు ఇది అరుదైన అవకాశమని వర్ధమాన నటుడు, మోడల్ సోహెల్ హమీద్  తెలిపారు.