శత్రువుకు శత్రువు మిత్రుడన్న సామెత ఉంది. నటి నయనతార ఇప్పుడు దాన్ని ఫాలో అవుతోందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని సంఘటనలు మనసులో బలంగా నాటుకు పోతాయి. వాటి నుంచి అంత తొందరగా బయటపడడం కష్టం. అగ్ర కథానాయకిగా రాణిస్తున్న సంచలన నటి నయనతార ఇప్పుడు శాసించే స్థాయిలో ఉంది. కథానాయకికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్న నయనతార ఎక్కవగా వర్ధమాన దర్శకుల చిత్రాల్లో నటించడం విశేషమే. అయితే ఇందుకో కారణం ఉందంటోంది కోలీవుడ్. నయనతార నటించిన తాజా చిత్రం ‘అరమ్’ త్వరలో తెరపైకి రానుంది. తను కలెక్టర్‌గా నటించిన ఈ చిత్రాన్ని నవ దర్శకుడు గోపీనయినార్ తెరకెక్కించాడు.
ఆయన దర్శకత్వంలో నయనతార నటించడానికి కారణం ఇంతకు ముందు గోపీనయినార్ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘కత్తి’ చిత్ర కథ తనదంటూ కోర్టు వరకూ వెళ్లి ఆయన్ని రచ్చలోకి లాగాడు.ఏఆర్.మురుగదాస్‌కు నటి నయనతారకు మధ్య చాలా కాలంగా కోల్డ్‌వార్ జరుగుతోందనే ప్రచారం ఉంది. అందుకు కారణం ‘గజని’ చిత్రంలో తన పాత్రను తగ్గించి, నటి అసిన్‌కు అధిక ప్రాముఖ్యమివ్వడమేనన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆ కసి తీసుకోవడానికే మురుగదాస్‌ను ఢీకొన్న గోపి నయినార్కు నయనతార అవకాశం ఇచ్చిందంటున్నారు.
ఇక తాజాగా నయనతార ‘కోకో’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకుడు. ఈయనకు నయనతార అవకాశం ఇవ్వ డం వెనుక ఒక కథ ఉందట.దర్శకుడు నెల్సన్ ఇంతకు ముందు శింబు హీరోగా ‘వేట్టైమన్నన్’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే ఆ చిత్రాన్ని శింబు మధ్యలోనే నిలిపేశారు. ఇక శింబుకు నటి నయనతారకు మధ్య సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి మధ్య డీప్ లవ్ చివరికి ఎలా ఫెయిల్ అయ్యిందో తెలిసిందే. శింబుపై ఆ కసి తీర్చుకోవడానికే దర్శకుడు నెల్సన్‌కు ‘కోకో’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కల్పించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం హల్చల్ చేస్తోంది.
 
             
		















