‘అవెంజర్స్’ ఫ్యాన్స్ కి సూపర్ సర్ప్రైజ్

‘ది అవెంజర్స్-ఎండ్ గేమ్’ విడుదల కోసం అవెంజర్స్ ఫ్యాన్స్ అంతా ఎంత ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరందరి ఆసక్తి వందింతలు కానుంది. ఎందుకంటే..
‘ది అవెంజర్స్-ఎండ్ గేమ్’ కోసం సంగీత సంచలనం ఏ.ఆర్.రెహమాన్ ఒక పాటను స్వరపరుస్తున్నారు. ఈ పాటను‘ది అవెంజర్స్-ఎండ్ గేమ్’ తెలుగు, తమిళ, హిందీ వెర్షన్స్ లో పొందుపరుస్తున్నారు. ఇది అవెంజర్స్ ఫ్యాన్స్ అందరికీ గర్వకారణం. మరీ ముఖ్యంగా ఈ పాటను హైదరాబాద్ లో ఏప్రిల్ 7 లేదా 8 తారీఖుల్లో జరిగే ఓ కార్యక్రమంలో ఏ.ఆర్.రెహమాన్ స్వయంగా ఆవిష్కరించనున్నారు. ది వాల్ట్ డిస్ని కంపెనీ స్టూడియో హెడ్ బిక్రమ్ దుగ్గల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు
 
A Surprise News for all the Avengers Fans
For the most awaited film of the year 2019 – The Avengers – End Game, AR Rehman is composing a song for Telugu, Tamil and Hindi Languages. This will be a proud moment for all the Avenger Fans and the Song Launch in the Telugu Language happens in Hyderabad during 7th or 8th of April in Presence of AR Rehman himself along with Mr. Bikram Duggal, Studio Head, The Walt Disney Company.