వర్మ ‘జి .ఎస్ .టి’ నాయిక మియా మాల్కోవా ఎవరో తెలుసా ?

రామ్‌ గోపాల్‌వర్మ తాజా సంచలనం ‘జి .ఎస్ .టి’  ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న కొత్త పేరు మియా మాల్కోవా ! ఈ పోర్న్‌ స్టార్‌ మియా మాల్కోవా అమెరికన్‌ అమ్మాయి.  మియానే మాల్కోవాను తన పేరు చివర తగిలించుకుంది… పేరు మరీ పక్కింటి అమ్మాయి పేరులా ఉందని! మాల్కోవా పేరులో హాట్‌ అండ్‌ సెక్సీ సూపర్‌ మోడల్‌ అప్పీల్‌, సౌండింగ్‌ ఉన్నాయనేది మియా భావన…

  • మియా బ్లిస్‌, మాడిసన్‌ స్వాన్‌, మెలిస్సా అన్నా మౌంటైన్‌, మెలిస్సా అన్నా ముర్రే, జెస్సికా… మియా ఇతర పేర్లు. జర్మన్‌, ఐరిష్‌, ఫ్రెంచ్‌, కెనడియన్‌… అబ్బో ఇంకా చాలా దేశాల మూలాలు మా ఫ్యామిలీలో ఉన్నాయని చెప్పుకొచ్చారీమె.
  •  తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలీదు కానీ… 16 ఏళ్ల వయసులో మియా మెక్‌డొనాల్డ్స్‌ సంస్థలో పని చేశారు. ఆమె నటించిన తొలి శృంగార చిత్రం విడుదలయ్యే ముందు వరకూ సిజ్లర్‌ అనే రెస్టారెంట్‌లో వీకెండ్స్‌ వెయిటర్‌గా పని చేశారు. పోర్నోగ్రఫీలో క్లిక్‌ అయితే నెక్ట్స్‌ డే జాబ్‌ మానేద్దాం లేదంటే కంటిన్యూ అవుదామనుకున్నారట. కానీ, తొలి చిత్రం విడుదలైన తర్వాత మియాకి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. తక్కువ కాలంలోనే పోర్న్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు.
  •  12 ఏళ్ల వయసులో మియా తొలిసారి పోర్న్‌ ఫిల్మ్‌ చూశారు. 19 ఏళ్ల వయసులో పోర్న్‌ ఇండస్ట్రీకి వచ్చారు. ఈ రంగం పట్ల ఆమె ఆకర్షితురాలు కావడానికి కారణం నటాషా మాల్కోవా (మియా స్నేహితురాలు, శృంగార చిత్రాల నటి). పేర్లు చూసి ఇద్దరూ చుట్టాలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.  రెండో తరగతి నుంచి స్నేహితులు. పోర్న్‌ ఫిల్మ్స్‌లో నటిస్తే ఎంత ఎక్కువ డబ్బులు వస్తాయో మియాకు వివరించి, ఇందులోకి తీసుకొచ్చిన ఘనత నటాషాకి దక్కుతుంది.
  •  ఒకరి ముందు నగ్నంగా నిలబడవలసిన రోజు వస్తుందని మియా మాల్కోవా ఎప్పుడూ అనుకోలేదట. ‘‘నా స్నేహితులకు నా గురించి పూర్తిగా తెలుసు. అందువల్ల, నన్ను పోర్న్‌ ఫిల్మ్స్‌లో చూసి షాకవ్వలేదు. కానీ, నేను మహా సిగ్గరి అనుకునేవాళ్లకు పెద్ద షాక్‌ తగిలింది’’ అని మియా ఓ సందర్భంలో తెలిపారు.
  •  ఖాళీ సమయాల్లో మియా అడ్డా ఇల్లే. రొమాంటిక్‌ నవలలు చదవడం, వీడియో గేమ్స్‌ ఆడడం ఆమె హాబీలు. అప్పుడప్పుడూ ఇతరుల పోర్న్‌ ఫిల్మ్స్‌ కూడా చూస్తారట… అందులో నటించిన అబ్బాయిల కోసం!  పెళ్లికి ముందు, అసలు ఈ మాటకు వస్తే పోర్నోగ్రఫీలోకి రాకముందు బాయ్‌ ఫ్రెండ్స్‌తో చాలాసార్లు శృంగారంలో పాల్గొన్నానని మియా స్పష్టం చేశారు.
  •  శృంగార చిత్రాల్లో నటించడం మొదలుపెట్టిన రెండేళ్లకు (జూలై 20, 2014లో… 21 ఏళ్ల వయసులో) మియా పెళ్లి చేసుకున్నారు. భర్త పేరు… డానీ మౌంటైన్‌. సారీ… మాజీ భర్త అనాలేమో! ఎందుకంటే… నెల నుంచి మేం వేర్వేరుగా ఉంటున్నామనీ, విడిపోయామనీ మొన్న 16న మియా ట్వీట్ చేసారు. డానీ కూడా శృంగార చిత్రాల నటుడే. మియాతో అతనికి రెండో పెళ్లి. అంతకు ముందు మరో శృంగార తార ఈవ్‌ ఏంజెలినాను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేశారు.
  •  ‘‘ఎవరితోనైనా నేను శృంగారంలో పాల్గొనడానికి సిద్ధమే. ఈ రంగంలో ఉన్నందుకు నేనేమీ సిగ్గు పడడం లేదు. నాకు కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి పూర్తి మద్దతు ఉంది. వీలైనంత కాలం శృంగార చిత్రాల్లో నటించాలనుంది. ఇందులో ఎంతో ఆనందం ఉంది. పోర్న్‌ ఫిల్మ్స్‌ వదిలేయాలని అనుకోవడం లేదు. మరో ఉద్యోగంలో నన్ను నేను ఊహించుకోలేను. మెయిన్‌ స్ట్రీమ్‌ చిత్రాలపై నాకు ఆసక్తి లేదు. ఐ లవ్‌ పోర్న్‌’’ – ఇవి ఐదేళ్ల క్రితం మియా మాటలు. అప్పుడు చెప్పినట్టుగానే ఆమె ఇంకా శృంగార చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పట్లో నటించడం మానేసే ఆలోచన కూడా ఆమెలో ఉన్నట్టు కనిపించడం లేదు.
  •  మియా మాల్కోవా ముఖ్యతారగా వర్మ తీసిన శృంగార చిత్రం పేరు ‘గాడ్‌… సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’. ఈ నెల 26న నెట్ లో విడుదల కాబోతోంది. ఈ చిత్రం వల్లే ఎక్కువశాతం మంది భారతీయులకు మియా పేరు, చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది.