షారుఖ్ ప్రచారం లో ప్రమాదం

షారూఖ్ ఖాన్  తన మూవీ ‘రాయిస్’ ప్రమోషన్  ఇబ్బందుల్లో పడేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయిస్ ప్రమోషన్ కోసం షారూఖ్ రైల్ లో ప్రయాణించారు. ప్రతీ స్టేషన్ లోనూ అభిమానులను పలకరిస్తూ ఉత్సాహపరిచారు. అయితే వడోదరా స్టేషన్ లో పరిస్థితి అదుపు తప్పి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో షారూఖ్ ఇబ్బందుల్లో పడ్డాడు.

జనవరి 23న రాయిస్ మూవీ ప్రమోషన్ లో భాగంగా షారూఖ్ వడోదరా స్టేషన్  చేరుకున్నారు. షారూఖ్ వస్తున్నాడన్న విషయం ముందే తెలియటంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడి చేరుకున్నారు. అభిమానులను మరింత ఉత్సాహ పరిచేందుకు టీషర్ట్స్, బాల్స్ వాళ్లు మీదకు విసిరాడు షారూఖ్. దీంతో తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి మరణించాడు. కొంత మంది గాయపడ్డారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు షారూఖ్ ఖాన్, రాయిస్ బృంద నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కోర్టుకు తెలిపారు. షారూఖ్ తో పాటు రాయిస్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ ఫై ఐపీసీ సెక్షన్ 304 ఏ 2 (నిర్లక్షంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణం కావటం) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసు కారణంగా షారూఖ్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది.