యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘డేర్‌’ ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌

ప్రవీణ్‌ క్రియేషన్స్‌ పతాకంపై కె. కృష్ణ ప్రసాద్‌ దర్శకత్వంలో ఎన్‌. రామారావు నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘పాటలు, వినోదం సినిమాకు హైలైట్‌. సీనియర్‌ నటులతో పాటు కొత్తవారూ నటించారు.త్వరలో ఆడియో, సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘పూర్తి యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఇది. నవీన్‌ కొత్తవాడైనా బాగా నటించాడు. జీవా, సుమన్‌ శెట్టి పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు కృష్ణప్రసాద్‌.

‘‘హీరోగా నాకిది తొలి సినిమా. కథ–కథనం ఆసక్తిగా ఉంటాయి’’ అన్నారు నవీన్‌. నటి సాక్షి, పాటల రచయిత సదా చంద్ర, మాటలు రచయిత రాఘవ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దంతు వెంకటే, సంగీతం: ఇ.ఆర్‌ నరేన్, సమర్పణ: ఎన్‌. కరుణాకర్‌ రెడ్డి.