సినిమా ఆఫర్‌ కోసం కాంప్రమైజ్‌ కావాలన్నాడు !

అదితి రావు హైదరి… అటు బాలీవుడ్‌తోపాటు ఇటు సౌత్‌ ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. 2006లో మాలీవుడ్‌ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన తెలుగు నేపథ్యం ఉన్న ఈ బ్యూటీ అదితి రావు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అక్కడక్కడా మెరుస్తూ వచ్చిన అదితి కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పిన సినిమా ‘చెలియా’. ఇండియన్‌ సినిమా లెజెండరీ డైరెక్టర్స్‌లో ఒకరైన మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాలో అదితి, తన అందం, నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.మధ్యలో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆ గ్యాప్‌కు కారణం ఏంటన్నది తాజాగా ”సండే గార్డియన్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.కాస్టింగ్‌ కౌచ్‌ మూలంగానే కొన్ని నెలలపాటు ఆమె సినిమాలకు దూరం అయ్యారంట…
“2013లో ఓ బాలీవుడ్‌ మేకర్‌ నా దగ్గరికొచ్చి ఓ సినిమా ఆఫర్‌ ఉందని చెప్పాడు. అయితే అందుకోసం నేను కాంప్రమైజ్‌ కావాలంటూ కోరాడు. చిర్రెత్తుకొచ్చేసింది. అక్కడి నుంచి వెళ్లిపోయా. ఏడ్చేశా.. ఎంత ధైర్యం వాడికి?.. ఇలాంటి తప్పుడు దారుల్లో ప్రయాణించి అనుకున్నది సాధించటం నాకు అవసరమా అనిపించింది. కొన్ని నెలలు ఖాళీగా ఉన్నా. కానీ, కొంత కాలానికి అవకాశాలు వాటికవే రావటం ప్రారంభించాయి. టాలెంట్‌ ఉంటే నిజాయితీగా సినిమాల్లో రాణించొచ్చన్న విషయం అప్పుడు అర్థమైంది”అని ఆమె తెలిపారు.“కాస్త ఓపికగా ఉంటే సరైన అవకాశాలు వచ్చి పడతాయని, అందుకే తానే ఉదాహరణ” అని ఆమె కొత్తవాళ్లకు సలహా ఇస్తున్నారు.
తాజాగా ‘సమ్మోహనం’ సినిమాతో పెద్ద హిట్‌ కొట్టి తన మార్క్‌ నటనతో ఆకట్టుకుంది. సమ్మోహనం తర్వాత అదితికి వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఈ బ్యూటీ.. ప్రస్తుతం మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ ‘నవాబ్‌’ సినిమాలోనూ కనిపించనుంది.సుధీర్‌ మిశ్రా ‘దాస్‌ దేవ్‌’లో కూడా నటిస్తున్నారు.‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ హీరోగా స్పేస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.ఇందులో అదితీరావ్‌ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్నారు.తెలుగులో ప్రముఖ హీరో లతో కూడా ఆమెకు అవకాశాలు న్నాయి.