మ‌హేశ్ బాబు విడుద‌ల చేసిన ‘మేజ‌ర్‌’ లుక్ టెస్ట్ వీడియో

26/11 ముంబై ఉగ్రవాదుల దాడిలో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా అడవి శేష్ నటిస్తున్న ‘మేజర్’ నిర్మిస్తున్నారు.`గూఢ‌చారి` ఫేం శ‌శి కిర‌ణ్‌ తిక్కా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అడవి శేష్ టైటిల్ రోల్  చేస్తుండగా, తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ  పాన్ ఇండియా  చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్  ప‌తాకాల‌పై నిర్మిస్తున్నారు. మేజ‌ర్‌లుక్ టెస్ట్ వీడియోను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు విడుద‌ల‌చేశారు.

అడవి శేష్ మాట్లాడుతూ.. ”2008 నుంచి మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ నా మైండ్ లో ఉన్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు  నేను యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్నాను. సందీప్ ఉన్ని కృష్ణన్ పై వచ్చిన ప్రతీ న్యూస్  కట్ చేసి పెట్టుకున్నాను. ‘మేజర్’ లాంటి పాన్ ఇండియన్ స్టోరీ నేను చెప్పగలను అని నాకు నమ్మకం వచ్చినప్పుడు ఉన్ని కృష్ణ‌న్ సందీప్  వాళ్ల ఫాద‌ర్‌ని కాంటాక్ట్ చేశాను.
రెండు మూడు సార్లు క‌లిసి వారితో మాట్లాడాను. ఒక సంద‌ర్భంలో సందీప్ అమ్మగారు నన్ను చూసి మా సందీప్ లానే  క‌నిపిస్తున్నావు  అన్నారు. ఆ క్ష‌ణం నాకు అర్ధ‌మైంది మేజ‌ర్ సందీప్ లైఫ్ స్టోరీ చేయ‌డానికి వారి పేరెంట్స్ నుంచి అంగీకారం వచ్చింద‌ని. నా ఫ్రెండ్స్ అనురాగ్ శ‌ర‌త్ టీమ్‌తో, అలాగే మహేష్ బాబు గారు, సోని పిక్చర్స్ సహకారంతో తెలుగు, హిందీ భాష‌ల‌లో ఒక  పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం.
“మనం చేయాలనుకున్న పని మీద నమ్మకం.. ఆ పని చేసేటప్పుడు మన సిన్సియారిటీ.. ఇవి రెండూ మేజర్ సందీప్ లక్షణాలు. ఇవి రెండూ నమ్ముకుంటే చాలు” అని లుక్ టెస్ట్ కి వెళ్లి  ఆయ‌న స్పిరిట్‌ని నాలో నేను వెతుక్కుని  మేజర్ సందీప్ గా ఓ ఫోటో దిగా .. అంటూ ఒక  ఫోటోని రివీల్ చేశాడు అడివిశేష్. అందులో మేజర్ సందీప్ హాఫ్ పేస్ కి మేజర్ రోల్ చేస్తున్న శేష్ హాఫ్ ఫేస్ ను అతికించి ఆసక్తికరంగా చూపించారు. ‘మేజర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిసెంబర్ 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.