అడ‌వి శేష్‌, శివానీ రాజ‌శేఖ‌ర్ `2 స్టేట్స్‌` ప్రోగ్రెస్

ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్ లో రూపొందిస్తున్న చిత్రం `2 స్టేట్స్‌`. చేత‌న్ భ‌గ‌త్ రాసిన న‌వ‌ల `2 స్టేట్స్‌` ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడ‌విశేష్‌, శివానీ రాజ‌శేఖ‌ర్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వెంక‌ట్ రెడ్డి  ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎంఎల్‌వి స‌త్య‌నారాయ‌ణ (స‌త్తిబాబు) నిర్మాత‌. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ను విజ‌య‌ద‌శ‌మికి విడుద‌ల చేస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా..  నిర్మాత ఎం . ఎల్‌ . వి . స‌త్య‌నారాయ‌ణ‌ (స‌త్తిబాబు) మాట్లాడుతూ – “బ్యూటీఫుల్, క్యూట్ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అడివిశేష్‌, శివాని పెయిర్ చ‌క్క‌గా ఉంది. సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం పూర్తి చేసుకుంటూ వ‌స్తున్నాం. ఇప్ప‌టికే నాలుగు షెడ్యూల్స్ పూర్త‌య్యాయి. కోల్‌క‌తాలో రెండు షెడ్యూల్స్‌, హైద‌రాబాద్‌లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశాం. డైరెక్ట‌ర్ వెంక‌ట్ రెడ్డిగారు సినిమాను ఆద్యంతం చ‌క్క‌గా తెర‌కెక్కిస్తున్నారు. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.
ద‌ర్శ‌కుడు వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ – “ ఈ నెల 22 నుండి  హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీ ఖర్చుతో  ఓ పెళ్లి పాటను జానీ మాస్టర్ నృత్య దర్శకత్వం లో  చిత్రీక‌రిస్తాం. త‌దుప‌రి విదేశాల్లో కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల్సి ఉంది.  దీంతో టాకీ మొత్తం పూర్త‌వుతుంది. అహ్లాద‌క‌రంగా సాగిపోయే ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది“ అన్నారు.
అడివి శేష్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, ర‌జ‌త్ క‌పూర్‌, భాగ్య‌శ్రీ,  లిజి, ఆదిత్య మీన‌న్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, హేమ‌, ఉత్తేజ్ త‌దితరులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్‌, సినిమాటోగ్ర‌పీ:  షానియ‌ల్ డియో, స్టంట్స్:  ర‌వివ‌ర్మ‌, డైలాగ్స్‌:  మిథున్ చైత‌న్య‌,  స్క్రీన్‌ప్లే: మ‌ధు శ్రీనివాస్‌, కోడైరెక్ట‌ర్‌:  బి . వి . సూర్య , చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ : ఎన్  శ్రీకాంత్ , ప‌బ్లిసిటీ డిజైన్‌:  అనిల్ – భాను , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఎం.ఎస్‌.కుమార్‌,  నిర్మాత‌: ఎం.ఎల్‌.వి. స‌త్య‌నారాయ‌ణ‌ (సత్తిబాబు), ద‌ర్శ‌క‌త్వం:  వెంక‌ట్ రెడ్డి .

Adivi Sesh and Shivani Rajasekhar ‘2 States’ progress

‘2 States’, starring Adivi Sesh and Shivani Rajasekhar in lead roles, is directed by debutant Venkat Reddy Kuncham.  The rom-com, an adaptation of Chetan Bhagat’s novel ‘2 States: The Story Of My Marriage’, is produced by MLV Sathyanarayana (Sattibabu) on Lakshya Productions.
The rom-com’s First Look will be unveiled this Vijayadasami.
Producer MLV Sathyanarayana says, “The film is being made as a beautiful, cute rom-com.  The lead pair is doing a great job.  We are completing the film as per a proper plan.  Four schedules have been completed, two each in Kolkata and Hyderabad.  Venkat Reddy garu’s direction is excellent.”
Director Venkat Reddy says, “From Oct 22, a marriage song will be choreographed by Jani Master on a huge set in Hyderabad.  Later, a few crucial scenes will be shot in foreign locations.  The entire talkie will be done with this.  This is an engaging love and family entertainer.”
CAST:
Adivi Sesh, Shivani Rajasekhar, Rajat Kapoor, Bhagya Sree, Lissy, Adithya Menon, Priyadarshi, Rahul Ramakrishna, Vidyullekha Raman, Hema, and Uttej.
CREW:
Music is by Anup Rubens.  Cinematography is by Shaneil Deo.  Stunts are by Ravi Varma.  Dialogues are by Mithun Chaitanya.  Screenplay is by Madhu Srinivas.  BV Surya is the co-director.  Chief Association Director is N Srikanth.  Publicity Design is by Anil-Bhanu.  MS Kumar is the Executive Producer.  Produced by MLV Satyanarayana (Sathi Babu).