ఒక్క సినిమా ఫ్లాప్‌తో ఉక్కిరి బిక్కిరి

ఎంతపెద్ద  హీరోకైనా ఒక్క ఫ్లాప్ పడితే… కష్టాలు కళ్ల ముందు కనిపిస్తాయి.సల్మాన్ ఇప్పుడు అదే  జరుగుతోందట. ఒకే ఒక్క సినిమా ఇప్పుడు ఆ బాలీవుడ్ స్టార్ హీరోను తెగ ఇబ్బంది పెడుతోందట. నిన్నమొన్నటి వరకు ఆ హీరో సినిమా కోసం కోట్లు కుమ్మరించిన డిస్ట్రిబ్యూటర్లు… ఇప్పుడు చేసుకున్న ఒప్పందాలను  తగ్గించుకుందామని ఒత్తిడి తీసుకొస్తున్నారట.’ట్యూబ్ లైట్’ సినిమాకు ముందు కొన్నేళ్ల నుంచి వరుస విజయాలు అందుకుంటూ వచ్చిన సల్మాన్… ఒక్కో సినిమాతో వందల కోట్లు కొల్లగొట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. మధ్యలో ఒకటి రెండు సినిమాలు అంతగా ఆడకపోయినా… అవి కూడా యావరేజ్ వసూళ్లు సాధించడంతో… సల్మాన్ ఇబ్బంది పడలేదు.
 అయితే కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ట్యూబ్ లైట్’ సినిమా భారీఫ్లాప్  కావడంతో… ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోయారు. ‘ట్యూబ్ లైట్’ నష్టాల సంగతి ఇలా ఉంటే… ఈ సినిమా ప్రభావం సల్మాన్ నయా మూవీ ‘టైగర్ జిందా హే’ బిజినెస్‌పై పడిందనే టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి మళ్లీ కొత్తగా ఒప్పందాలు చేసుకోవాలని పట్టుబడుతున్నారట పంపిణీదారులు!భారీ మొత్తానికి ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిన చాలామంది… ‘ట్యూబ్ లైట్’ వసూళ్లను చూపుతూ కొత్త సినిమా కాంట్రాక్టుల్ని సవరించాలని కోరుతున్నారట. మరోవైపు సల్మాన్ సినిమాల శాటిలైట్ రైట్స్‌ను గంపగుత్తగా భారీ మొత్తానికి దక్కించుకున్న ఓ టీవీ ఛానల్ కూడా ఇదే రకమైన ప్రతిపాదనను తెరమీదకు తెచ్చిందట. మొత్తానికి ఒకే ఒక్క సినిమా ఫ్లాప్‌తో  సల్మాన్ ఖాన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు

సల్మాన్ కి షారూఖ్ బహుమతి

బాలీవుడ్ ఖాన్ త్రయంలో షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు చాలా సన్నిహితంగా ఉంటారు. ఈ మధ్య ఒకరి సినిమాలు ఒకరు ప్రమోట్ చేసుకోవ‌డ‌మే కాకుండా గెస్ట్ రోల్స్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి ఆనందాన్ని అందిస్తున్నారు. సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘ట్యూబ్ లైట్’ లో షారూఖ్ అతిధి పాత్రలో కనిపించి మెరిశాడు. ఇక ఇప్పుడు ఆనంద్ ఎల్ .రాయ్ దర్శకత్వంలో షారూఖ్ ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో సల్మాన్ గెస్ట్ రోల్ పోషిస్తున్నాడట. ఈ క్రమంలో రీసెంట్ గా సెట్ కి వచ్చాడట సల్మాన్. అప్పుడు తన ఫ్రెండ్ కి కృతజ్ఞతగా ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడట షారూఖ్. సల్మాన్ ప్రస్తుతం ‘టైగర్ జిందా హై’ అనే చిత్రంలో నటిస్తుండగా, ఈ మూవీ డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇక షారూఖ్ ఇంతియాజ్ అలీ డైరెక్షన్లో ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ అనే మూవీతోను బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్ట్ లో విడుదల కానున్నట్టు సమాచారం.