‘ఏయ్ జూనియర్’ ఫస్ట్ లుక్ విడుదల

తెలంగాణా స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి చేతులమీదుగా ” ఏయ్ జూనియర్ ” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ చిత్రాన్ని వ్యాంకిష్ మీడియా సంస్థ నిర్మించగా , షేక్ గౌస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు రవికుమార్ పొన్నగంటి. తెలంగాణా స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సందేశం తో కూడుకున్న ఈ ప్రేమకథా చిత్రం తప్పక విజయవంతం కావాలని , సమాజానికి ఉపయోగపడే మరెన్నో మంచి చిత్రాలని నిర్మించాలని ఈ చిత్ర దర్శక నిర్మాతలని కోరారు.
ఈ చిత్ర నిర్మాత షేక్ గౌస్ మాట్లాడుతూ ” ఏయ్ జూనియర్ ” ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించిన తెలంగాణా స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియచేశారు. యువతని ఆకట్టుకునే అంశాలు ఎన్నో ఈ చిత్రంలో ఉన్నాయని దర్శకుడు మంచి ప్రతిభావంతుడని , అలాగే ఈ చిత్ర యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పనిచేశారని , సంగీతానికి ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రానికి అమ్మపండు అందించిన సంగీతం మరో హైలెట్ గా నిలుస్తుందని , ఈ చిత్రాన్ని ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మకం ఉందని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న మా ఈ చిత్రం టీజర్ ని వచ్చే వారంలో రిలీజ్ చేయనున్నట్లు ఆడియో ని ఆగస్ట్ మొదటి వారంలో చిత్రాన్ని ఆగస్ట్ చివరి వారంలో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
చిత్ర దర్శకులు రవికుమార్ పొన్నగంటి మాట్లాడుతూ కాలేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఓ చక్కని టీనేజ్ లవ్ స్టోరీ గా దీన్ని తెరకెక్కించామని, అసభ్యతకు తావులేకుండా కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఈ చిత్రాన్ని నిర్మించామని , ఇందులో పాటలన్నీ యువతకు నచ్చే విధంగా ఉంటాయని ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకి టెక్నీషియన్స్ కి అలాగే నాకు దర్శకునిగా అవకాశమిచ్చిన షేక్ గౌస్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
నటీనటులు : ఆయుష్, షిరిన్, ప్రమోదిని, మణిచందన, మున్ని, అనిత,
డా.మండవ శ్రీనివాస్, సీతామహాలక్ష్మి, మిమిక్రి శివ, వెంకటేశ్వరరావు,
బ్యానర్ : వ్యాంకిష్ మీడియా
సమర్పించు : సబీనా,నిర్మాత : షేక్ గౌస్
సహ నిర్మాతలు : చేపూరి చంద్రకాంత్ , పులిషేరి ప్రణిదీప్
రచన దర్శకత్వం : రవికుమార్ పొన్నగంటి
సంగీతం : అమ్మపండు,కెమెరా : దుర్గాప్రసాద్,ఎడిటర్ : కొడగంటి వేణు
పాటలు : ఫణిదీప్ విశ్వనాథ్ , వెన్నెల శ్యామ్, డా. యల్లాప్రగడ మల్లికార్జునరావు.
కొరియోగ్రఫి : అనీష్ , తాజ్‌ఖాన్
కో – డైరెక్టర్ : సుధాకర్ S,ప్రొడక్షన్ ఎక్జిక్యూటివ్ : నాగిరెడ్డి