నా కల దర్శకురాలు కావడం !

డైరెక్టర్‌ ఐశ్వర్యరాయ్‌…ఇక నుంచి ఈఅందాల కథానాయికను ఇలాగే పిలవాల్సి ఉంటుంది. త్వరలోనే ఐశ్వర్య దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతుంది. కథానాయికగా చేస్తూనే..మరో పక్క ఇప్పటికే ప్రొడక్షన్‌కు సంబంధించిన అన్ని విషయాలపై పట్టుసాధించింది. ఇక దర్శకత్వం శాఖలో రాణించాలని భావిస్తోంది. దర్శకురాలు కావడం అనేది ఐశ్వర్యరాయ్  చిన్ననాటి కల. కానీ ఎప్పుడూ ఈ విషయం బయటపెట్టలేదు. ఆ శాఖ గురించి నిత్యం అధ్యయనం చేస్తూనే ఉంది. ఒక పక్క షూటింగ్‌లో పాల్గొంటూనే మరో పక్క ‘ఆ షాట్‌ని తానైతే ఎలా తీసి ఉండేదాన్ని’ అని అనుకునేదట. వివిధ భాషల్లో కథానాయికగా నటించిన ఈమె దర్శకత్వ పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైపోయింది. ఏ సినిమా అన్నది త్వరలోనే తెలియబోతుంది.

ఐషూ దర్శకత్వం చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రొడక్షన్‌ నుంచి ఇప్పటికే ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంది. అది ఆమెకు అనుకూలంగానే వచ్చింది. చాలా ఏళ్లుగా నటిగా ఉంటున్న ఈమె దర్శకత్వ బాధ్యతలు ఎప్పుడు చేపట్టేది మాత్రం చాలా రహస్యంగా ఉంచింది. అయితే ఓ సందర్భంలో మాత్రం ‘నా కల దర్శకురాలు కావడం’ అని చెప్పింది. త్వరలోనే అది సాధ్యమవుతుందని ఆశపడుతున్నట్టు పేర్కొంది. అందుకే ఐశ్వర్య త్వరలో చేయాల్సిన సినిమాలు గురించి మాత్రం పెద్దగా ఎక్కడా వెల్లడించడం లేదు కూడా. ఈమె చేయబోయే చిత్రాలపై చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. అందులో అభిషేక్‌ బచ్చన్‌తో కలసి ఓ సినిమా చేస్తున్నట్టు ఇప్పుడు ప్రచారమవుతోంది. ఓ క్లాసిక్‌ రీమేక్‌లో ఐశ్వర్య కథానాయికగా చేస్తుందని,  ‘జస్మినే’ ఆ చిత్రమే అని చెబుతున్నారు. ఈ చిత్రం అద్దె గర్భం నేపథ్యంలో రూపొందనుంది