నా కెరీర్‌లోనే ఛాలెంజింగ్‌ సినిమా ఇది!

ఐశ్వర్యా రాయ్‌ చోళుల నాశనాన్ని కోరుకునే రాణి నందినిగా నటిస్తారు. అలానే నందిని తల్లి మందాకినిగా మూగ పాత్రలోనూ కనిపిస్తారట. ‘నా కెరీర్‌లోనే చాలెంజింగ్‌ సినిమా ఇది’ అంటూ ఐశ్వర్యా రాయ్‌ మణిరత్నం రూపొందిస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వమ్‌’ చిత్రం గురించి పేర్కొన్నారు.. ఐశ్వర్యా రాయ్‌ ఈ సినిమాలో నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్నారు.మణిరత్నం సినిమాలో రాజ్యాధికారం కోసం కుట్రలు చేసే నందిని పాత్రలో ఆమె కనిపించనున్నారు. 10వ శతాబ్ధానికి చెందిన కథతో నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్‌ మీదకు వెళ్లనుంది.శంకర్ ‘జీన్స్‌’ లో ఐశ్వర్యా రాయ్‌ ద్విపాత్రాభినయం చేసినా ..నటించింది ఒక్క పాత్రలోనే. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌తో రెండు పాత్రలు చేసినట్టు మ్యాజిక్‌ చేశారు. కానీ ఈసారి నిజంగానే ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఈ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వమ్‌’. పాపులర్ తమిళ నవల ‘పొన్నియిన్‌ సెల్వమ్‌’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, నయనతార, కీర్తీ సురేశ్, అనుష్క, అమలా పాల్, పార్తిబన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తారని సమాచారం.
 
ఈనేలకు వందనం చేస్తున్నా!
‘ఇక్కడి వాతావరణం, ఆహారపు అలవాట్లు, ప్రేమ, ఆప్యాయత, నేను తిరిగిన నేలను జీవితాంతం గుర్తుంచుకుంటా’ అని మాజీ ప్రపంచ సుందరి, నటి ఐశ్వర్యారాయ్‌ అని అన్నారు.
“తమిళ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆలయాల తో పాటు.. మహోన్నతుల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నానని ఐశ్వర్యారాయ్‌ చెప్పారు. ఐశ్వర్యారాయ్‌ తెరంగేట్రం చేసింది కోలీవుడ్‌లోనే..”నాకు గౌరవం తెచ్చిన తమిళ నేలకు వందనం చేస్తున్నా..” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చాలాకాలం తర్వాత ఐశ్వర్య బుధవారం చెన్నైకి వచ్చిన సందర్భంగా తమిళ సంప్రదాయాలు, కోలీవుడ్‌ గురించి చెన్నై మాట్లాడారు.
‘ప్రపంచ సుందరి’ కిరీటం 1994లో దక్కించుకున్న ఐశ్వర్యా రాయ్‌.. మణిరత్నం సినిమా ‘ఇద్దరు’తో కోలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీ గా మారారు. అభిషేక్‌ బచ్చన్‌తో పెళ్లి తర్వాత ఎంపిక చేసుకున్న సినిమాలు మాత్రమే చేస్తోంది.