ఆమె ద్విపాత్రాభినయానికి పది కోట్లు

‘రాత్‌ ఔర్‌ దిన్‌’ రీమేక్‌లో ఐశ్వర్యరాయ్ నటించబోతున్న వార్త తెలిసిందే. 1967లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. సత్యన్‌ బోస్‌ దర్శకత్వం వహించగా ప్రదీప్‌ కుమార్‌, నర్గీస్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. మల్టీపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ ఉన్న మహిళ పాత్రలో నర్గీస్‌ తన అద్భుతమైన నటనతో జాతీయ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు రూపొందబోయే రీమేక్‌లో నర్గీస్‌ పాత్రకు ఐష్‌ను తీసుకోబోతున్నారు. మాతృక మాదిరిగానే ఇందులో ఐష్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఐశ్యర్యారాయ్‌కి రాత్రి ఎవరైనా పరిచయం అయితే మార్నింగ్‌ కల్లా మర్చిపోతారు. ఆ తర్వాతి రోజు ఉదయం మాత్రమే వాళ్లను గుర్తుపట్టగలరు. అలాగే.. మార్నింగ్‌ ఎవరైనా పరిచయం అయితే నైట్‌ కల్లా మర్చిపోతారు. మళ్లీ సేమ్‌.. అంటే.. తర్వాతి రోజు రాత్రి వస్తే కానీ వారు గుర్తుకురారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘వన్‌ పర్సన్‌… టూ లైఫ్స్‌’ అన్నమాట. దీన్నే ‘మల్టీపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌’ అంటారు.

ఇదంతా ఓ ఎత్తయితే, ఇందులో నటించేందుకు ఐష్‌ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసిందని తెలుస్తోంది. ఈ పాత్రలో నటించేందుకుగానూ ఆమె అక్షరాల పది కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకోబోతుందట. పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు నిర్మాతలు కూడా ఓకే చెప్పారట. ఈ చిత్రాన్ని ప్రెర్నా అరోరా, సిద్ధార్థ్‌ ఆనంద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

2016లో వచ్చిన ‘ఏ దిల్‌ హే ముష్కిల్‌’ చిత్రం తర్వాత ప్రస్తుతం ఐష్‌ ‘ఫన్నె ఖాన్‌’లో నటిస్తోంది. అనిల్‌ కపూర్‌, ఐశ్వర్య రాయ్‌, రాజ్‌కుమార్‌ రావ్‌ ప్రధాన పాత్రలో ఫన్నె ఖాన్‌ రూపుదిద్దుకుంటోంది. ఐష్‌ రాజ్‌కుమార్‌ ప్రేమికులుగా కనిపించనున్నారు. ‘ఎవ్రిబడీస్‌ ఫేమస్‌’ అనే డచ్‌ చిత్రాకి ఇది రీమేక్‌. అతుల్‌ మంజ్రేకర్‌ డెబ్యూ డైరెక్షన్‌లో ఇది తెరకెక్కుతోంది. అభిషేక్‌ బచ్చన్‌ చివరిగా ‘హౌస్ ఫుల్‌ 3’ చిత్రంలో నటించారు. సంజయ్‌ లీలా బన్సాలీ తదుపరి చిత్రంలో నటించనున్నట్టు సమాచారం.