ఐశ్వర్య అంటే అందం మాత్రమే కాదు !

పెళ్లైనా.. చివరకు ఓ బిడ్డకు తల్లైనా కూడా ఐశ్వర్యారాయ్‌కు ఉన్న క్రేజ్ ఏమాత్రం కూడా తగ్గలేదు. అందం.. అభినయంతో కొన్ని సంవత్సరాలుగా రాణిస్తూనే ఉన్నారు. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్.. ఇలా అన్ని భాషల్లోనూ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. బిడ్డ తల్లి అయ్యాక కొంత విరామం తర్వాత ఇటీవల మళ్ళీ నటిగా పునర్ ప్రవేశం చేసింది. ఈ సారి ఐశ్వర్య అందాల నటి కాదు …. అద్భుతమైన నటి. అయితే హాలీవుడ్‌లో మాత్రం ఆమె ఆరేడు సినిమాలకు మించి చేయలేదు. ఇటీవల ఓ ఇంటర్వూలో ఐష్ తను హాలీవుడ్ సినిమాల్లో నటించడం గురించి మాట్లాడారు….

 హాలీవుడ్ కోసం భారతీయ చిత్ర పరిశ్రమను వదులుకోలేనని స్పష్టం చేశారు. భారతీయ సినిమాల్లో తాను నటిస్తూ చాలా ఎంజాయ్ చేశానన్నారు. మంచి దర్శకులతో పని చేశానని ఆమె తెలిపారు. 2015లో జబ్బా సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టానని ఐష్ తెలిపారు. ఇప్పటికీ ఐశ్వర్య నటించగలదా.. లేదా? అని చర్చించుకుంటున్నారని.. అయితే ఐశ్వర్య అంటే అందం మాత్రమే కాదు ,నటించగలదు కూడా… అని నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డానని ఐష్ తెలిపారు.