‘ప్రియమైన ప్రియ’ ట్రైలర్ ..ఆడియో లాంచ్ !

అశోక్ కుమార్ ,లీషా ఎక్లెయిర్స్  హీరోహీరోయిన్ లు గా గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై  A. J సుజిత్ దర్శకత్వం వహించిన  సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ” ప్రియమైన ప్రియ.  A J. సుజిత్ ,A బాబు నిర్మించిన ఈ మూవీ ట్రైలర్, ఆడియో రిలీజ్ ఫంక్షన్  హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా ఈ చిత్రానికి సంగీతం అందించారు..ఈ చిత్రం సంగీత దర్శకుడిగా శ్రీకాంత్‌ దేవాకు 100 వ చిత్రం కావడం విశేషం..  ఈ కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ బసిరెడ్డి ,నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్ , సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి , ప్రొడ్యూసర్ ఎంఆర్‌ చౌదరి వడ్లపట్ల ముఖ్య అధితులు హాజరై చిత్రయూనిట్ ను అభినందించారు.. సి.హెచ్‌ సీతారామ్ యాదవ్  నిర్మాణ నిర్వాహణలో రూపోందిన ఈ
మూవీని మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా థియేటర్ లలో రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.

కె.ఎల్‌ దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ.. “ ఈ చిత్రం క్వాలిటీ పరంగా హైస్టాండర్డ్స్ ఉంది.. విజువల్స్ ఎక్స్‌ట్రార్డనరీగా తీసారు.. డీఓపీ కి ప్రత్యేక అభినందనలు.. కొత్త కుర్రాడైనా హీరో అశోక్‌ ఎక్స్‌ట్రార్డనరీగా పర్‌ఫార్మ్‌ చేసారు.. హీరో లీషా అందంతో పాటు యాక్టింగ్‌లోనూ చూడముచ్చటగా ఉంది” అంటూ చిత్ర యూనిట్‌ని మెచ్చుకున్నారు. శ్రీకాంత్ దేవా తండ్రి గారు ప్రముఖ సంగీత దర్శకులు దేవాతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు.

సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి గారు మాట్లాడుతూ… ఆకాశాన హడావిడిగా పరిగెత్తుతున్న జగన్నాధ రథచక్రాలను భూమార్గం పట్టిస్తా… భూకంపం పుట్టిస్తా.. అన్న శ్రీశ్రీ మాటలను గుర్తు చేస్తూ… ఈ చిత్రాన్ని కూడా ”భూమార్గం పట్టించి సక్సెస్‌తో భూకంపం పుట్టిస్తా’ అంటూ చిత్ర యూనిట్‌ను మెచ్చుకున్నారు. దర్శకుడు సుజీత్ ప్రతిభను, సాంకేతిక వర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కొత్త ముఖాలైనా అద్భుతంగా నటించారంటూ హీరోహీరోయిన్స్‌ను మెచ్చుకున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్‌ శ్రీకాంత్ దేవా మాట్లాడుతూ.. ఈ చిత్రం నా కెరీర్‌లో 100 వ చిత్రం. తన తండ్రిగారు ప్రముఖ సంగీత దర్శకులు దేవా.. తొలిప్రేమ వంటి ఎన్నో సూపర్‌ హిట్స్ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తండ్రి లాగే తానను కూడా  ప్రోత్సాహించాలనీ,  తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు, సపోర్ట్‌ చేయాలని కాంక్షించారు.

హీరో అశోక్‌ మాట్లాడుతూ..  ఈ చిత్రం ఒక మంచి సైకో థ్రిల్లర్‌. ఇందులో హీరో నేనే, సైకో నేనే . యాక్టర్‌గా నన్ను నేను ప్రూవ్‌ చేసుకునే అద్భుతమైన చిత్రం ఇది.  నేను హీరోగా యాక్ట్‌ చేస్తున్న చిత్రానికి శ్రీకాంత్ దేవా గారు మ్యూజిక్ అందించడం నాకు గర్వంగా ఉంది… అంటూ మ్యూజిక్ డైరెక్టర్‌ శ్రీకాంత్ దేవా గారికి కృతజ్ఞతలు తెలియజేసారు.

హీరోయిన్‌ లీషా మాట్లాడుతూ..   లేడీ ప్రొడ్యూసర్‌ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు సంతోషిస్తున్నాను .ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలనీ..కోరారు
ఈ కార్యక్రమంలో Mr చౌదరి వడ్లబట్ల , చిన్న గౌడ్ , పులి అమృత్ , ck మాయ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ ch. మాయ , నటుడు శశాంక్  పలువురు పాల్గోన్నారు