ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో అజయ్ `మైదాన్`

జీవితంలో అయినా, ఆటలో నైనా ఆత్మ విశ్వాసం, కష్టపడే తత్వంతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే విజయం వరిస్తుంది. క్రీడా నేపథ్యంలో స్ఫూర్తిమంతమైన కథగా మైదాన్ ను నిర్మిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక మంది ఆదరించే ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`. భారత దేశాన్ని ఫుట్ బాల్ రంగంలో ప్రపంచ పటంలో నిలిపిన ఒక కోచ్ నిజ జీవిత కథ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేశారు. `బధాయి హో` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కోల్ కత్తా, లక్నో, ముంబై నగరాల్లో 50 రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఏప్రిల్ కి చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది.
ప్రియమణి, `బధాయి హో` ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న`మైదాన్` చిత్రాన్ని జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను సైవిన్ కాద్రస్, రితేష్ షా అందిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మైదాన్ నవంబర్ 27, 2020న విడుదల అవుతోంది.
 
MAIDAAN Inspired from TRUE story
Maidaan staring Ajay Devgn is a celebration of biggest sport Football!
It’s a story of CHANGE & SELF BELIEF.Inspired from an incredible TRUE story.
A story of one of the finest Coach that emerged from India , the one who put India on the world map.
Today we launch our first look of MAIDAAN with 2 posters With MAIDAAN we bring the spirit of life and sport both together. For success in life , like sport, it requires self-belief, hard work, sacrifice, and limitless dedication.
Directed by Amit Ravindernath Sharma of Badhai Ho fame, Maidaan has been shot extensively in Kolkata , Lucknow and Mumbai for over 50 days already and the filming will be completed by April. It also stars National award winning actress Priyamani from South, Gajraj Rao who created magic with Badhai Ho and the well known Bengali actor Rudranil Ghosh.
 
Produced by Zee Studios, Boney Kapoor, Akash Chawla and Arunava Joy Sengupta, screenplay and dialogues are written by Saiwyn Quadras and Ritesh Shah respectively. The film is set to release on 27th November 2020.