మరాఠా వీరుడు ‘తానాజీ’ గా అజయ్‌ దేవగన్‌

అజయ్‌ దేవగన్‌ ‘తానాజీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. మరాఠా వీరుడు సుబేదార్‌ తానాజీ మలుసరే జీవితం ఆధారంగా దర్శకుడు ఓ రౌత్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా గురువారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ట్వీట్‌ ద్వారా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను అజయ్ దేవగన్‌ అభిమానులతో పంచుకున్నారు. ‘ఆయన తన ప్రజలు, తన నేల తల్లి, తన రాజు ఛత్రపతి శివాజీ కోసం పోరాడారు. అద్భుతమైన భారత చరిత్రలో కీర్తించని యుద్ధవీరుడు సుబేదార్‌ తానాజీ మలుసరే’ అని చెబుతూ అజయ్ దేవగన్‌  షేర్‌ చేశారు. వయాకామ్‌ 18మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

బాలీవుడ్ లోను బాహుబలిని మించిన సినిమా తీయాలని దర్శక నిర్మాతలు కసరత్తులు చేస్తున్నారు . ఈ క్రమంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలోఈ ‘తానాజీ’  చిత్రం రూపుదిద్దుకోనుంది. ఓమ్ రౌత్ తెరకెక్కించనున్న ఈ చిత్రం మరాఠా వీరుడు సుబేదార్ తానాజీ మలుసరే జీవిత నేపథ్యంలో రూపొందనుంది.వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్  సినీ అభిమానులలో వైబ్రేషన్స్ కలుగ చేస్తుంది.

ఇండియన్ సినిమా స్థాయిని పదింతలు పెంచి విమర్శకులతోనే ఔరా అనిపించిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం పలు రికార్డులు సాధించింది. బాలీవుడ్ మూవీ కూడా అందుకోని రికార్డులని ‘బాహుబలి 2’ అందుకుంది. అయితే ఇప్పుడు ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ దర్శక నిర్మాతలు బాహుబలి చిత్రాన్ని టార్గెట్ గా పెట్టుకొని సినిమాలు తీస్తున్నారు. ఇప్పటికే ‘2.0’ చిత్రం భారీ రేంజ్ లో తెరకెక్కి, విడుదలకి సిద్దం అయింది. ఇక త్వరలో ‘సంఘమిత్ర’ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఇక మోహన్ లాల్ ‘మహా భారతం’ కూడా అదే రేంజ్ లో రూపొందనుంది.