అజిత్ ‘వివేగం’ కు విపరీతమైన క్రేజ్ !

శివ ద‌ర్శ‌క‌త్వంలో  అజిత్ చేస్తున్న కొత్త చిత్రం “వివేగం”. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇక అప్ప‌టి నుండి సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి.  అజిత్ పై అభిమానులే కాదు, సెల‌బ్రిటీలు కూడా ప్ర‌శంసల వర్షం కురిపించారు. ఇక ఈ మూవీ 120 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌తుంద‌ని తెలుస్తుండ‌గా, చిత్రానికి సంబంధించిన కొన్ని విష‌యాలు డైరెక్ట‌ర్ రివీల్ చేశాడు….

స్పై థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పాటు అక్ష‌ర హాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్ష‌ర పాత్ర చుట్టే సినిమా అంతా తిరుగుతుంద‌ట‌. బాలీవుడ్ న‌టుడు వివేగంలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని కొన్నాళ్ళుగా ప్ర‌చారం జ‌రిగింది.  వివేక్ఒబెరాయ్  ఒక ప‌వ‌ర్ ఫుల్ రోల్ లో క‌నిపిస్తాడ‌ని ద‌ర్శ‌కుడు క్లారిటీ ఇచ్చాడు.

ఈ చిత్రం సెర్బియా, బ‌ల్గేరియా, ఆస్ట్రియా , క్రొయేషియా  ప్రాంతాల‌లో మేజ‌ర్ పార్ట్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోగా, కొద్ది భాగం మాత్ర‌మే ఇండియాలో జ‌రుపుకుందట‌. తాజా షెడ్యూలు చిత్రీకరణ సెర్బియాలో జరిగింది. అది పూర్తవడంతో అజిత్‌ శనివారం చెన్నైకి తిరుగుముఖం పట్టారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్దఎత్తున విమానాశ్రయం వద్ద వాలిపోయారు. ఆయన బయటకు వచ్చి కారు ఎక్కేంత వరకు ఫొటోలు తీసుకోవడం కోసం పోటీపడ్డారు. అజిత్‌ కూడా కొందరితో సెల్ఫీలు, ఫొటోలకు దిగారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. హాలీవుడ్‌స్థాయి కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 10వ తేదీన తెరపైకి తీసుకురానున్నారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇందులో అజిత్‌ సరసన తొలిసారి కాజల్‌ కథానాయికగా ఆడిపాడింది. ఈ సినిమా కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కాజల్‌ పేర్కొన్నారు. మరోవైపు అజిత్‌ అభిమానులు ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని నిరీక్షిస్తున్నారు. త్వరలోనే ట్రైలర్‌, పాటలను ఆవిష్కరించనున్నారు.