ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ‘వివేకం’ కు 100 కోట్లు !

‘తలా’ అజిత్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ ‘వివేకం’. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆకట్టుకుంది. అజిత్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ శివ దర్శకుడు. అజిత్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలోనూ అదే స్థాయి చూపిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ‘వివేకం’ తొలి రోజు బెనిఫిట్ షోస్ తో కలిపి ఏకంగా 33 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. గురువారమే రిలీజ్ అయిన ఈ సినిమాకు లాంగ్ వీకెండ్ కూడా కలిసొచ్చింది.

రెండో రోజు కూడా భారీ వసూళ్లను సాధించిన వివేకం రెండు రోజుల్లోనే ఏకంగా 66 కోట్ల వసూళ్లను సాధించి రికార్డ్ సృష్టించింది. అంతేకాదు మూడో రోజు కూడా వసూళ్ల హవా కొనసాగించిన ఈ సినిమా శనివారం 15 కోట్ల కలెక్షన్లు సాధించిందన్న ప్రచారం జరుగుతోంది. ఆదివారం కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి 100 కోట్ల వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు.120 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు ముందే 100 కోట్ల బిజినెస్ చేయగా.. లాంగ్ రన్ లో తమిళనాట సరికొత్త రికార్డ్ లు సృష్టిస్తుందన్న జోష్ లో ఉన్నారు అజిత్ ఫ్యాన్స్.