పాత్రకు త‌గిన‌ట్టు నన్ను నేను మార్చుకున్నాను !

డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన కుమారుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ‘మెహబూబా’. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌ నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అయిన ఈ చిత్రం మే 11న విడుదలకు రెడీగా ఉంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చిత్ర హీరో ఆకాష్ పూరి మీడియాతో ముచ్చటించారు…..
ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ క్షణం కోసం 15 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను. మే 11న ‘మెహ‌బూబా’ విడుద‌ల‌వుతుంది. సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 15 ఏళ్లు వెన‌క్కి వెళ్లిన‌ట్లు అనిపించింది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అంద‌రూ సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. మా నాన్న‌గారి చేసే ల‌వ్‌స్టోరీస్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. అలాగే ఈ ల‌వ్‌స్టోరీ కూడా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. నాన్న ఇలాంటి ల‌వ్‌స్టోరీ చేస్తారని ఊహించ‌లేదు. వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ల‌వ్‌స్టోరీ ఇన్ టాలీవుడ్‌ అని చెప్పగలను.
కాలేజీ ల‌వ్‌స్టోరీ కాదు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో ఇండియా అబ్బాయి, పాకిస్థాన్ అమ్మాయి మ‌ధ్య సాగే సినిమా. ముందు ఆర్మీ బ్యాక్‌డ్రాప్ అనగానే నేను సెట్ అవుతానా అనిపించింది. అలాగే చాలా రీసెర్చ్ చేశాను. వారెలా మాట్లాడుతారు. ఎలా న‌డుస్తారు. ఎలా సెల్యూట్ చేస్తారు వంటి వన్నీ నేర్చుకున్నాను. అందుకే టైమ్ ఎక్కువ తీసుకున్నాను. నాన్న క్యారెక్ట‌ర్ చెప్పిన త‌ర్వాత దానికి త‌గిన‌ట్టు నన్ను నేను మార్చుకున్నాను.
హీరోగా నా డెబ్యూ కాబ‌ట్టి న‌న్ను ఎక్క‌డా పెద్ద‌గా చూపించ‌లేదు. స్టోరీ ప్ర‌కారం నా రోల్ చాలా సహజంగా ఉంటుంది. పూర్వ జ‌న్మ‌ల నేప‌థ్యాలంటే న‌మ్మేవాణ్ణే. అయితే నా సినిమాకు అలాంటి కాన్సెప్ట్ వ‌స్తుంద‌ని అనుకోలేదు. నేను చిన్న‌ప్పుడు చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో కొత్త‌గా ఉంటాను. చాలా విష‌యాలు తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ఇకపై చేసే ప్ర‌తి సినిమాకు నేర్చుకుంటూనే ఉంటాను. సినిమా చూసిన వారంద‌రూ మీ నాన్న‌గారి స్టైల్‌కు డిఫ‌రెంట్‌గా ఉందన్నారు. అలా అన్నారు కాబ‌ట్టే మా నాన్న‌ను నేనే మళ్లీ పరిచయం చేస్తున్నాన‌ని చెప్ప‌గ‌లిగాను..’’ అని అన్నారు.