1971 క‌థ‌ని 2018 క‌థ‌తో అందంగా క‌నెక్ట్ చేశారు !

పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌ నిర్మించిన చిత్రం ‘మెహబూబా’. 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ అధినేత దిల్‌ రాజు మే 11న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్స్‌కి హ్యూజ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇండస్ట్రీలోను, అటు ఆడియన్స్‌లోను ‘మెహబూబా’ చిత్రంపై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొని వున్నాయి. అందరి అంచనాలకు రీచ్‌ అయ్యేవిధంగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన దైన స్టైల్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు.   ఈ సంద‌ర్భంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో యూత్‌కి చిత్రాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా…
దిల్‌రాజు మాట్లాడుతూ “ఈ నెల 11న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. సినిమా మీద న‌మ్మ‌కంతో ముందు కాలేజీ యూత్‌కి ప్ర‌ద‌ర్శించాం. సినిమా జ‌నాల్లోకి వెళ్ల‌డం చాలా కీల‌కం. కొత్త‌వాళ్ల‌తో తెర‌కెక్కించిన సినిమా త‌ప్ప‌కుండా జ‌నాల్లోకి వెళ్లాలి. పూరి మ‌న‌సు పెట్టి స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుందో `మెహబూబా` సినిమా చూస్తే తెలుస్తుంది. 1971 క‌థ‌ని 2018 క‌థ‌తో అందంగా క‌నెక్ట్ చేశారు. జెన్యూన్ ల‌వ్‌స్టోరీ ఇది. డ‌బుల్ పాజిటివ్ చూసిన‌ప్పుడే సినిమా మీద న‌మ్మ‌కం కుదిరింది. మామూలుగా పూరి స్టైల్‌లో ఒక సెటైర్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలాంటిదేమీ ఉండ‌దు“ అని చెప్పారు.
పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ “సినిమా న‌చ్చ‌డంతో దిల్‌రాజుగారు యువ‌త‌కు ప్ర‌ద‌ర్శించ‌మ‌ని చెప్పేశారు. నిజంగానే జెన్యూన్‌గానే చేశాను. సీన్లు, డైలాగులు బావున్నాయి. ఇడియ‌ట్‌, పోకిరి త‌ర్వాత మా ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఆడియన్స్ ఒక‌చోట న‌వ్వుతార‌ని నేననుకుంటే, వాళ్లు నాలుగు చోట్ల న‌వ్వుతున్నారు. ఇది నాకు స్పెష‌ల్ థ్రిల్‌ని క‌లిగించింది“ అని అన్నారు.
ఛార్మి మాట్లాడుతూ “ఈ షో పూర్త‌యిన త‌ర్వాత నేరుగా ఎయిర్‌పోర్టుకి వెళ్తున్నాను. టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి మా సినిమాకు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. యు.ఎస్‌.లో ఈ సినిమాను ప్రీమియ‌ర్ వేస్తున్నాం. ఈ నెల 10న రాత్రి 8 గంట‌ల‌కు అక్క‌డ ప్రీమియ‌ర్ వేస్తాం. యు.ఎస్‌.లో రెండు వారాలుంటాం. అక్క‌డ చాలా థియేట‌ర్ల‌ను, చాలా మందిని క‌లుస్తున్నాం“ అని అన్నారు.
విష్ణు మాట్లాడుతూ “దిల్‌రాజుగారు సినిమాకు చాలా స‌పోర్ట్ చేస్తున్నారు. సీన్స్ చూస్తుంటే ఒళ్లు గ‌గుర్పొడుస్తోంది“ అని తెలిపారు.
నేహాశెట్టి మాట్లాడుతూ “యూత్‌తో క‌లిసి సినిమా చూశాక‌, వాళ్లు స్పందించిన తీరు చూసి న‌మ్మ‌కం రెట్టింప‌యింది“ అని అన్నారు.
ఆకాష్ మాట్లాడుతూ “ఈ షో ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో యు.ఎస్‌.కి వెళ్తున్నాం. మే 11న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం“ అని చెప్పారు.
ఆకాష్‌ పూరి, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రంలో విషురెడ్డి, మురళి శర్మ, అశ్వని, జ్యోతిరానా, టార్జాన్‌, షేక్‌ జునైద్‌, షాయాజీ షిండే, షయల్‌ ఖాన్‌, సురభి, రూప, అజయ్‌, పృధ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సందీప్‌ చౌతా, ఆర్ట్‌: జానీ షేక్‌, డిఓపి: విష్ణు శర్మ, ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధికీ, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌: అనిల్‌ పాడూరి, (ఆద్విత క్రియేటివ్‌ స్టూడియో), సమర్పణ: శ్రీమతి లావణ్య, నిర్మాణం: పూరి కనెక్ట్స్‌, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.