అందులో మాత్రం టాప్ స్టార్స్‌ని దాటేస్తున్నాడు !

అక్కినేని అఖిల్‌కు ఇంతవరకు  హిట్ లేదు. కెరీర్‌ని టర్న్ చేసే సినిమా పడలేదు. హీరోగా నటించింది రెండు సినిమాలే. కానీ ఈ కుర్రాడికి బ్రాండ్ వాల్యూ మాత్రం భారీగా ఉంది. షాప్ ఓపెనింగ్ కి వస్తే చాలు అఖిల్‌కు లక్షలు ఇస్తున్నారట. రీసెంట్‌గా హైదరాబాద్‌లో లావణ్య త్రిపాఠితో కలసి ఓ జిమ్ ఓపెనింగ్‌కు హాజరయ్యాడు అఖిల్. కేవలం 15 నిమిషాలు మాత్రమే పాల్గొన్న ఈ కార్యక్రమానికి అఖిల్ 8 లక్షల వరకు ఛార్జ్ చేశాడట. అంటే అఖిల్ నిమిషానికి 50 వేలకుపైగా వసూల్ చేశాడని చెప్పొచ్చు.
 సాధారణంగా కాజల్ అగర్వాల్, తమన్నా లాంటి టాప్ హీరోయిన్లే షాప్ ఓపెనింగ్స్‌కు లక్షల్లో ఛార్జ్ చేస్తుంటారు. అలాంటిది రెండు సినిమాల అనుభవమే ఉన్న అఖిల్‌కు ఇంత మొత్తం చెల్లించడం అంటే మాములు విషయం కాదు అంటున్నారు ట్రేడ్ పండిట్స్. పైగా అఖిల్ డెబ్యూ మూవీ ‘అఖిల్’ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తాపడితే, సెకండ్ సినిమా ‘హలో’ అదే బాటలో నడిచింది. అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న అఖిల్‌కు ఈ రేంజ్ లో ఎలా చెల్లించారని సినీజనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. కానీ వెనకాల ఫ్లాప్స్ ఉన్నా,అఖిల్‌కు భారీగా ఇస్తున్నారంటే  ‘అక్కినేని’  బ్రాండ్ వాల్యూనే కారణం అంటున్నాయి మార్కెట్ వర్గాలు.
అఖిల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో ఇతన్ని ఫాలో అయ్యే కుర్రాళ్ళు బోల్డంత మంది. అందుకే అఖిల్‌ని అంబాసిడర్‌గా నియమించుకుంటే తమ ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయని భావిస్తుంటాయి కంపెనీలు. పైగా హీరోగా లాంచ్ అవ్వకముందు నుంచీ కార్పొరేట్ సెక్టార్‌లో ఈ కుర్రాడికి మంచి గుర్తింపు ఉంది. ‘అఖిల్’ సినిమా కంటే ముందే టైటాన్ వాచ్, మౌంట్ డ్యూ సాఫ్ట్ డ్రింక్‌కు ప్రచారం చేశాడు. తర్వాత షాపింగ్ మాల్ యాడ్స్‌లోనూ నటించాడు. ఆ క్రేజ్ నే క్యాష్ చేసుకుంటున్నాడు. అఖిల్ ప్రస్తుతం  ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా  చేస్తున్నాడు
నా లిస్ట్‌లో స్కై డైవింగ్‌ ఉంది !
“ఈ ఏడాది నేను చేయాల్సిన లిస్ట్‌లో స్కై డైవింగ్‌ ఉంది. కచ్చితంగా ఈ సంవత్సరం అది చేసి తీరతాను. అది ఎలా చేస్తాను, ఎప్పుడు చేస్తాను, ఎక్కడ చేస్తాను అనేది చెప్పలేను. కానీ, చేసి తీరతాను”….అని అంటున్నాడు అఖిల్
సినిమాల కోసం నేను ఈ ఎడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ పట్ల ఇష్టం పెంచుకున్నానా అంటే కాదు. ఎందుకో స్పోర్ట్స్‌పై అలా ఇష్టం పెరిగింది. ఆ స్పోర్ట్స్‌ నాకు కావాల్సిన థ్రిల్‌, కిక్‌ ఇస్తాయి.
ఎలాంటి అడ్వెంచర్‌ స్పోర్ట్‌ అయినా రిస్క్‌ ఉంటుంది. రిస్క్‌ లేకపోతే ఎడ్వెంచర్‌ ఎందుకవుతుంది? మా ఫ్యామిలీ మెంబర్స్‌ ఎప్పుడూ నన్ను ఆ తరహా గేమ్స్‌ ఆడవద్దని అడ్డుకోలేదు. కాకపోతే ఎలాంటి స్పోర్ట్‌ అయినా భద్రతా ప్రమాణాలు అనుసరించి ఉంటాయి. కాబట్టి లైఫ్‌ త్రెటనింగ్‌ కాదు. గతంలో బంగీ జంపింగ్‌ చేశా. ఏ హైట్‌ నుంచి చేశానో తెలీదు కానీ, సేఫ్టీ ప్రికాషన్స్‌ ఉండటం వల్ల రిస్క్‌ లేదు. మనాలీకి వెళ్లి చేసిన ఓ యాడ్‌ కోసం రాక్‌ క్లైంబింగ్‌ నిజంగానే చేశా. దానిలోనే థ్రిల్‌ ఉంటుంది.