అఖిల్‌ ‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ వుందో తారక ‘ ?

తొలి చిత్రం ‘అఖిల్’ నిరాశ పరచడంతో అక్కినేని అఖిల్ సుదీర్ఘ విరామం తీసుకున్నారు. ఈ నిరీక్షణకు తెరదించుతూ తన ద్వితీయ చిత్రానికి గత ఏప్రిల్‌లో శ్రీకారం చుట్టారు అక్కినేని అఖిల్. ‘మనం’ ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం శరవేగంగా తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ పతాకాలపై నాగార్జున నిర్మిస్తున్నారు. ఇందులో కళ్యాణి ప్రియదర్శిని కధాయికగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఫిల్మ్ ఛాంబర్‌లో ‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ వుందో తారక’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం.

అయితే దీనికి సంబంధించిన స్టిల్స్‌ లీక్‌ అయింది. దీనిపై అఖిల్‌ తండ్రి, కింగ్‌ నాగార్జున స్పందించారు…. లీక్‌ అయిన ఫొటో కంటే అందమైన, మెరుగైన ఫొటోలు చాలా ఉన్నాయని అన్నారు. ఈనెల 21న వీటికి సంబంధించిన స్టిల్స్‌ను విడుదల చేయబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు. అవి ఎలా ఉండబోతున్నాయనే తెలపడానికి శనివారం ఓ క్లూ ఇస్తానని సోషల్‌ మీడియా ట్విట్టర్‌లో తెలిపారు.  డిసెంబర్‌ 22న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.