అఖిల్‌ ‘హలో గురూ ప్రేమ కోసమే’ ?

 

అఖిల్‌ రెండో సినిమాకు ‘హలో గురూ ప్రేమ కోసమే’ టైటిల్‌ను ఆల్మోస్ట్‌ కన్ఫర్మ్‌ చేసినట్లేనని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జనాలు చెప్పుకుంటున్నారు. ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా అక్కినేని నాగార్జున ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ లవ్‌ అండ్‌ యాక్షన్‌ బేస్డ్‌ ఎంటర్‌టైనర్‌కు ‘జున్ను’తో పాటు పలు టైటిల్స్‌ వినిపించాయి. చివరకు, అఖిల్‌ తల్లిదండ్రులు నాగార్జున, అమల జంటగా నటించిన ‘నిర్ణయం’లో సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘హలో గురూ ప్రేమ కోసమే..’లో పల్లవినే టైటిల్‌గా కన్ఫర్మ్‌ చేశారట! త్వరలో ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ మొదలు కానుంది. అందులో రొమాంటిక్‌ సీన్స్‌ తీస్తారట. ఫస్ట్‌ షెడ్యూల్‌లో హీరోపై ఫైట్స్‌ తీశారు. ఇందులో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ఎనౌన్స్‌ చేయలేదు.