అఖిల్ ఈసారి ‘హలో’ అంటున్నాడు !

అఖిల్‌ అక్కినేని ‘హలో’ అని పలకరిస్తూ అలరించబోతున్నాడు అఖిల్‌ అక్కినేని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి ‘హలో!’ అనే పేరును ఖరారు చేశారు. ఆ విషయాన్ని నాగార్జున సోమవారం ట్విట్టర్‌లో వీడియో ద్వారా తెలియజేశారు. శనివారమే ‘అఖిల్‌ సినిమా పేరుని వూహించండి’ అంటూ నాగార్జున ఓ హింట్‌ని ఇచ్చాడు. ఆదివారం నాగచైతన్య కూడా తన సినిమా ‘ఏమాయ చేసావె’లోని హల్లో… అంటూ ముగిసే పాటని ట్వీట్‌ చేసి మరో హింట్‌ ఇచ్చాడు. దాంతో ‘హలో..’ పేరుతోనే సినిమా పేరు మొదలయ్యే అవకాశాలున్నాయని అర్థమైంది. ‘హలో గురూ ప్రేమకోసమే’ అనే పేరు ఖరారు చేస్తారేమో అని వూహించారంతా. అయితే చిత్రబృందం మాత్రం కేవలం ‘హలో!’ అని సినిమాకి నామకరణం చేసింది. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించిన చిత్రాలకి రెండు అక్షరాల పేర్లే ఎక్కువగా ఉంటాయి. ఈ చిత్రానికి కూడా అదే సెంటిమెంట్‌ని అనుసరించినట్టు తెలుస్తోంది. నాగార్జున ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసిన వీడియోలో ఎన్టీఆర్‌, కాజల్‌, ప్రభాస్‌, శ్రుతిహాసన్‌, నాగచైతన్య, రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌, సమంత, సూర్య, నాని, వెంకటేష్‌, రాజమౌళి, రకుల్‌ప్రీత్‌సింగ్‌, రానా తదితరులు ‘హలో’ అంటూ సినిమా పేరును ప్రకటించారు. అక్కినేని నాగేశ్వరరావు పాట ‘హలో హలో అమ్మాయి…’తో ఆ వీడియో పూర్తవడం విశేషం. ఈ సినిమాలో అఖిల్‌ సరసన కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికగా నటిస్తోంది. డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Akhil ,Vikram K.Kumar,Akkineni Nagarjuna’s Film Titled As “Hello”

 
Akhil Akkineni’s latest film presented by Annapurna Studios, Manam Enterprises in Vikram K.Kumar’s Direction, Produced by Akkineni Nagarjuna gets a title. ‘Hello’ has been confirmed as title for this Love & Action Entertainer. King Nagarjuna revealed the first look of ‘Hello’ via his Twitter account on monday. Along with this Nagarjuna posted a video too in which many industry celebrities wished the unit with a ‘Hello’. Video starts with Young Tiger NTR wishing ‘Hello’ followed by Kajal, Prabhas, Shruthi Hasan, Ram Charan, Naga Chaitanya, Varun Tej, Samantha, Suriya, Nani, Venkatesh, Rajamouli, Rakul Preet Singh, Rana’s wishes. Finally when Akkineni Nagarjuna asked his father Legendary Late ANR garu to confirm the title, Natasamrat Akkineni Nageswara Rao garu sings ‘Hello..Hello…’ Revealing the First Look of ‘Hello’. It is known that December is lucky month for King Nagarjuna. ‘Hello’ is also being readied to release on December 22nd. Music is being composed by Anup Rubens, Cinematography by P.S.Vinod, Written & Directed by Vikram K.Kumar