ఆ రెండు విషయాల్లో ఇంకా క్లారిటీ లేదు !

ప్రస్తుతం తన రెండో సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్న అక్కినేని కుర్ర హీరో అఖిల్… ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు. అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ కలిసి నటించిన ‘మనం’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉందని కొద్ది రోజుల క్రితం వార్తలు వినిపించాయి. అయితే దీని టైటిల్… హీరోయిన్  విషయంలో మాత్రం ఇంకా ఒక క్లారిటీ రాలేదు. హీరోయిన్ విషయం లో అయితే … దక్షిణాది అయిపోయి ఇప్పుడు ఉత్తరాది హీరోయిన్ ల పేర్లు వినిపిస్తున్నాయి . అయితే, ప్రకటించకపోయినా హీరోయిన్ విషయం లో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది .

ఈ సినిమా టైటిల్ అంటూ ఇప్పటివరకు నాలుగు పేర్లు వార్తల్లో నిలిచాయి. సినిమా మొదలు కావడానికి ముందే దీనికి ‘జున్ను’ అనే టైటిల్ ఫిక్స్ చేశారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత అఖిల్ రెండో సినిమాకు నాగార్జున పాటలోని పల్లవి అయిన ‘హలో గురు ప్రేమ కోసమే’ అనే టైటిల్‌ను పెట్టబోతున్నారనే ఊహాగానాలు వినిపించాయి. ఇక కొద్ది రోజుల క్రితం ఈ సినిమా కోసం ‘రంగులరాట్నం’ అనే టైటిల్‌ను రిజిష్టర్ చేయించారనే పుకార్లు షికారు చేశాయి. అఖిల్ సినిమాకు ఇలాంటి విభిన్నమైన పేరు పెట్టొచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి.

అయితే తాజాగా ఈ సినిమా కోసం ‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక’ అనే పేరును పరిశీలిస్తున్నారని వార్తలు మొదలయ్యాయి. అఖిల్ రెండో సినిమా టైటిల్ విషయంలో ఇన్ని పేర్లు వినిపిస్తున్నా, చిత్ర యూనిట్ మాత్రం దీనిపై ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. మరి రాబోయే నాగార్జున పుట్టిన రోజు నాడు ప్రకటించే ఈ సినిమా టైటిల్ కోసం ఈ నాలుగు పేర్లను మాత్రం పరిగణనలోకి తీసుకుంటారా లేక మరో కొత్త పేరును ఫైనల్ చేస్తారా అన్నది చూడాలి.