ఆ ముగ్గురి బదులు ఈ ముగ్గురితో ‘మనం’

‘పెద్ద సినిమాలంటే వాటి వెనుక ఎన్నో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని’ …తాను కోల్పోయిన అవకాశాన్ని గుర్తుచేసుకున్నాడు తమిళ్,తెలుగు హీరో సిద్దార్థ…..అక్కినేని కుటుంబం అంతా కలసి నటించిన చిత్రం ‘మనం’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించి టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. అంతేకాదు ఈ సినిమా అక్కినేని కుటుంబ పెద్ద అయిన స్వర్గీయ నాగేశ్వరరావు చివరి సినిమా కావడంతో.. అక్కినేని ఫ్యామిలీకి తీపి గుర్తుగా నిలిచిపోయింది.
అక్కినేని నాగేశ్వర్‌రావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సమంత అందరూ కలసి ఈ చిత్రంలో నటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని హీరో సిద్దార్థ ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు….. ‘మొదట దర్శకుడు విక్రమ్ ఈ సినిమాను కె. విశ్వనాథ్, వెంకటేష్, నన్ను తీసుకొని చేద్దామనుకున్నాడు. నాగార్జున ప్లేస్‌లో కె. విశ్వనాథ్, నాగార్జున ప్లేస్‌లో వెంకీని, నాగ చైతన్య పాత్రను నాతో చేయించాలని భావించాడు. కానీ చివరకు ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీ వద్దకు వచ్చింది’ అని చెప్పుకొచ్చాడు సిద్దార్థ.