ఆ మర్యాద నాకు బాగా నచ్చేసింది !

మా నాన్న కూడా అంతే. ఎదుటి వ్యక్తి వయసు, అనుభవంతో సంబంధం లేకుండా గౌరవిస్తారు. ఆయనలో ఈ మర్యాద నాకు బాగా నచ్చేసిందంటున్నారు కమల్‌హాసన్‌ రెండో కుమార్తె అక్షరాహాసన్‌.నా వయసెంత? ఆయన వయసెంత? అయినా సరే సెట్స్‌లో నన్ను ‘జీ’ (గారు) అని గౌరవంగా పిలిచేవారు. అంతేకాదు, వైఫల్యాల్లో ఎవరైనా అణిగిమణిగే ఉంటారని, కానీ, వరుస విజయాలు వస్తున్నా ఎంత అణకువగా ఉండాలనే విషయాన్ని అజిత్‌ను చూసి నేర్చుకోవాలని అన్నారు.

అక్షరాహాసన్‌ చెబుతోంది …. తమిళ హీరో అజిత్‌ గురించి! సెట్స్‌లో అజిత్‌ ఇతరుల్ని గౌరవించే తీరు సేమ్‌ టు సేమ్‌ మా నాన్నలానే ఉంటోందన్నారు. ‘వీరం, వేదాలం’ సినిమాల తర్వాత శివ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘వివేకం’. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌. ఆ సంగతి తెలిసే అక్షరాహాసన్‌ కీలక పాత్ర నటించడానికి అంగీకరించారట. ‘‘హీరోయిన్‌గా నటించడం నాకిష్టమే. కానీ, నేను చేసిన రోల్‌ బాగుంది.ఐయామ్‌ హ్యాపీ’’ అన్నారు అక్షర.

ఈ అమ్మాయి హిందీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, ఇప్పుడు మాతృభాష తమిళంలో సినిమా చేశారు. తమిళ సినిమాలు కంటిన్యూ చేస్తారా? అని అక్షరను అడిగితే… ‘‘నాకు భాషాబేధాలు లేవు. ముంబైలోనే ఎక్కువ ఉంటున్నాను కాబట్టి, తమిళం మాట్లాడడం కొంచెం కష్టమైపోతోంది. నేర్చుకుంటున్నా, కొన్నాళ్లుగా నాన్నతో మాట్లాతున్నప్పుడు తమిళంలోనే మాట్లాడుతున్నా. స్పష్టంగా  మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా. నేనెందుకు అలా చేస్తున్నానో నాన్నకు అర్థమైంది’’ అని నవ్వేశారు. అంటే.. అక్షర మరిన్ని తమిళ సినిమాల్లో నటించాలనే ఆలోచనతో ఉంది.