అగ్రస్థానంలో అక్షయ్‌ కుమార్‌, దీపికా పదుకొనే !

లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. ఓటీటీలో కొన్ని సినిమాలు విడుదలవుతున్నా వెండితెరపై అభిమాన హీరోహీరోయిన్ల సందడి లేక ఫ్యాన్స్‌ నిరాశకు లోనవుతున్నారు. ఈ తరుణంలో ‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వే సినీ విభాగంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకునే, అక్షయ్‌ కుమార్‌ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఈ సర్వేలో 16 శాతం ఓట్లతో దీపికా ప్రథమ స్థానంలో నిలవగా.. అక్షయ్ 24 శాతం ఓట్లతో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ను వెనక్కి నెట్టి నంబర్‌ 1గా నిలిచాడు. హీరోయిన్ల జాబితాలో గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా రెండో స్థానం సొంతం చేసుకోగా.. సల్మాన్‌ ఖాన్‌ 4 స్థానంతో సరిపెట్టుకున్నాడు.
 
టాప్‌- 10 హీరోలు
1. అక్షయ్‌ కుమార్‌-24 శాతం
2. అమితాబ్‌ బచ్చన్‌- 23
3. షారుఖ్‌ ఖాన్‌- 11
4. సల్మాన్‌ ఖాన్‌- 10
5. ఆమిర్‌ ఖాన్‌-6
6. ఇతరులు- 6 శాతం
7. అజయ్‌ దేవ్‌గణ్‌-4
8. హృతిక్‌ రోషన్‌-4
9. రణ్‌వీర్‌ సింగ్‌-4
10. రణ్‌బీర్‌ కపూర్‌-2
 
సర్వేలో దీపికకు 16 శాతం ఓట్లు .. ప్రియాంక చోప్రాకు 14, కత్రినా కైఫ్‌కు 13, ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌కు 10, అనుష్క శర్మకు 9 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక స్టార్‌ కిడ్‌ అలియా భట్‌తో పాటు బాలీవుడ్‌ క్వీన్‌గా పేరొందిన కంగనా రనౌత్‌ 6 శాతం ఓట్లతో సంయుక్తంగా ఏడో స్థానంలో నిలవడం విశేషం. కరీన కపూర్‌ ఖాన్‌కు కేవలం 3 శాతం ఓట్లే పడ్డాయి.