అంతా కరెక్ట్‌గా.. క్లీన్‌గా ఉందని అబద్దం చెప్పలేను!

విదేశాల్లో ‘బెల్ బాటమ్’ షూటింగ్ పూర్తి … అక్షయ్ కుమార్.. జెడ్ స్పీడుకు కరోనా తాత్కాలింగా బ్రేకులు వేసింది కానీ.. పూర్తిగా వేయలేదని చెప్పాలి. ఈ యేడాది అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. సినిమాను ఓటీటీలో కాకుండా డైరెక్ట్‌గా థియేటర్స్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘లక్ష్మీ బాంబ్’ దీపావళి కానుకగా హాట్ స్టార్‌లో విడుదల కానుంది. ఆ సంగతి పక్కన పెడితే.. అక్షయ్ కుమార్.. తాజాగా ‘బెల్ బాటమ్’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్స్ ఇవ్వడంతో.. విదేశాల్లో ఈ సినిమా మిగిలిన షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని హీరో అక్షయ్ కుమార్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసాడు.ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో వాణీ కపూర్, హ్యూమా ఖురేషి, లారా దత్తా హీరోయిన్స్‌గా నటించారు.ఈ చిత్రాన్ని ఆగష్టులో మొదలు పెట్టి సెప్టెంబర్ 30న కంప్లీట్ చేసారు. ఈ చిత్రాన్ని ఎక్కువగా స్కాట్లాండ్, గ్లాస్గో‌లలో పిక్చరైజ్ చేసారు. చివరగా లండన్‌లో కంప్లీట్ చేసారు. ఈ చిత్రాన్ని 1980లో జరిగిన  కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన రియల్ హీరో జీవిత కథ అని చెబుతున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ‘రా’ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. గూఢచారిగా ఎలాంటి ఛాలెంజెస్ స్వీకరించాడనే దానిపై ఈ సినిమాను పూర్తి ఉత్కంఠ భరితంగా దర్శకుడు రంజిత్ ఎం.తివారీ తెరకెక్కించాడు. మరోవైపు అక్షయ్ కుమార్.. త్వరలో ‘పృథ్వీరాజ్’, ‘ఐతరంగీ రే’ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు. మొత్తంగా అక్షయ్ కుమార్ కరోనా సమయంలో భారీగా విరాళం అందజేసి తన పెద్ద మనసు చాటుకున్నాడు. అంతేకాదు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎక్కువ సంపాదన ఉన్న నటుడిగా ఫోర్బ్స్‌లో పత్రికలో చోటు దక్కించుకున్నాడు.