ఒలింపిక్స్‌లో ఫస్ట్‌ ‘గోల్డ్‌’ మెడల్‌ ఫై చిత్రం

క్రీడా చిత్రాలపై దర్శక నిర్మాతల దృష్టి పడింది. ఇటీవల అమిర్‌ ఖాన్‌ చేసిన క్రీడా  చిత్రం ‘దంగల్‌’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు నమోదు చేసింది. రియల్‌ కథలకు ఇంతటి స్పందన ఉంటుందని  అందరికీ తెలిసింది.  ఇప్పుడు ఆ తరహా చిత్రాలు చాలానే రానున్నాయి. అక్షయ్  కుమార్‌ కూడా వాస్తవంగా జరిగిన ఘటనలపై వచ్చే కథలనే సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది ఆయన చేసిన మూడు చిత్రాల్లో ‘ఎయిర్‌లిఫ్ట్‌’, ‘రుస్తోమ్‌’ రియల్‌ స్టోరీసే. ఈ రెండూ బాక్సాఫీస్‌ను కొళ్లగొట్టాయి. ఇప్పుడు ఓ స్పోర్ట్స్‌ కథను ఎంపిక చేసుకున్నారు. అదే 1948లో లండన్‌ ఒలిపింక్స్‌లో భారత దేశానికి మొదటి సారిగా హాకీలో గోల్డ్‌ మెడల్‌ వచ్చింది. ఆ పురస్కారం సాధించిన నేపథ్యంలో దాని కోసం పడ్డ కష్టం, ఆ సందర్భంగా భారతదేశంలో స్వాతంత్య్ర వేడుకలు ఎలా నిర్వహించుకున్నారు ? అన్న దానిపై ఈ చిత్రం రూపొందుతోంది.

దీనికి ‘గోల్డ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టీవీ స్టార్‌ మౌనీ రాయ్  కథానాయికగా నటిస్తోంది. అమిత్‌ సాధ్‌ కునాల్‌ కపూర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లో అక్షయ్ పాతకాలం మనిషిగా కన్పిస్తూ ఆకట్టుకున్నారు. రితేశ్‌ సిధ్వానీ, ఫర్హాన్‌ అక్తర్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ చికాగోలో జరుగుతోంది. ఆదివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

‘బిగ్‌ బాస్‌’లో హోస్ట్‌గా చేయడంలేదు
బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌ చేస్తున్న కార్యక్రమం ‘బిగ్‌బాస్‌’కు ఆయన స్థానంలో అక్షయ్  కుమార్‌ హోస్ట్‌గా చేస్తారని ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందించారు. తాను ఆ కార్యక్రమం చేయడం లేదని ట్విట్టర్‌లో స్పష్టం చేశారు.