ఈ మధ్య ఎక్కువగా సందేశాత్మక చిత్రాల్లో నటిస్తున్న అక్షయ్.. మరోవైపు పలు సామాజిక కార్యక్రమాలతోనూ అలరిస్తున్నాడు.మానవత్వం కలిగిన హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. ఓ బాలీవుడ్ స్టార్ అక్షయ్ రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా రియల్‌స్టార్ అనిపించుకుంటున్నాడట.
బాలీవుడ్‌లో వంద కోట్ల క్లబ్ సినిమాల్లో ఎక్కువగా ఖాన్ త్రయం నటించిన చిత్రాలే ఉంటాయి. అయితే ఆ ముగ్గురికీ.. సమాన స్థాయిలో హండ్రెడ్ క్రోర్స్ క్లబ్‌లో తన సినిమాలతో సత్తా చాటిన కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం బీటౌన్‌లో వరుస సినిమాలతో ఫుల్ సక్సెస్‌రేట్‌తో దూసుకుపోతున్న అక్షయ్.. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోగా మన్ననలు అందుకుంటున్నాడు.
ఈ మధ్య ఎక్కువగా సందేశాత్మక చిత్రాల్లో నటిస్తున్న అక్షయ్.. మరోవైపు పలు సామాజిక కార్యక్రమాలతోనూ అలరిస్తున్నాడు. ఇప్పటికే తన కార్యక్రమాల ద్వారా ఎంతోమంది రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ పెట్టి బార్డర్‌లో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాడు. తాజాగా వన్యప్రాణుల కోసం మరో సామాజిక కార్యక్రమాన్ని తలపెట్టాడు ఈ బాలీవుడ్ స్టార్. 2016లో వచ్చిన ‘రుస్తోమ్’ లో తాను ధరించిన నేవి యూనిఫామ్‌ను ‘సాల్ట్ స్కౌట్.కామ్’ లో వేలానికి పెట్టాడు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును జంతు సంరక్షణ కోసం వినియోగించబోతున్నాడట.
ప్రస్తుతం అక్షయ్.. ‘కేసరి’, ‘మొగల్’, ‘గోల్డ్’, ‘హౌస్ ఫుల్-4’, ‘2.0’ వంటి ఐదు భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. రజనీ చేసిన ‘2.0’ షూటింగ్ పూర్తై విడుదలకు సిద్ధంగా ఉండగా …పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ‘కేసరి’, ‘గోల్డ్’ చిత్రాలు బయోగ్రాఫికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘మొగల్’ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక తన సూపర్ హిట్ కామెడీ ఫ్రాంచైస్ ‘హౌస్ ఫుల్’లో కొత్త చిత్రం ‘హౌస్ ఫుల్-4’ని కూడా మొదలుపెట్ట బోతున్నాడు అక్షయ్. ఇలా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నచూసి అక్షయ్ ని చూసి ఎంత మంది హీరోలు రియల్ హీరోలుగా మారతారో చూడాలి.
రజనీకాంత్ ‘2.0’లో అక్షయ్ కుమార్ విలన్ కాదట !
రజనీకాంత్ ‘2.0’లో అక్షయ్ కుమార్ విలన్ కాదట. అక్షయ్‌ది ‘యాంటీ హీరో’ రోల్. అంటే.. మంచి కోసం చెడు చేస్తారు కదా? ఆ టైప్ అన్నమాట. సినిమా చూసేటప్పుడు మనం డా. రిచర్డ్ (సినిమాలో అక్షయ్ కుమార్ పాత్ర పేరు) పాయింటాఫ్ వ్యూలో ఆలోచిస్తే, అతను చేసేవన్నీ కరెక్ట్‌గానే అనిపిస్తాయట.
పర్యావరణానికి హాని కలిగించే టెక్నాలజీని అంతం చేయాలనుకుంటాడట రిచర్డ్. పైగా అతను ఏ హక్కుల కోసం పోరాడతాడో అవన్నీ సమంజసంగానే ఉంటాయట. ఇలాంటి క్యారెక్టర్లు ఉన్నప్పుడు హీరోతో పాటు యాంటీ–హీరో కూడా గెలవాలనుకుంటాం. కానీ, ఫైనల్‌గా గెలిచేది హీరోనే కదా. మరి.. ఈ హీరో–యాంటీ హీరో రోల్స్‌ని చిత్రదర్శకుడు శంకర్ ఎలా డీల్ చేసి ఉంటారన్నది ఆసక్తికరం.
‘2.0’ని విడుదల వాయిదా పడింది. ‘వెయిట్ అండ్ సీ’ అన్నట్లు… ఈ పాత్రకు ముందు అక్షయ్ పాత్రకు ముందు కమల్‌హాసన్‌ని తీసుకున్నారు. నటుడిగా ఆయనకున్న పేరుని దృష్టిలో పెట్టుకుని యాంటీ హీరో రోల్‌ని పాజిటివ్ షేడ్స్‌తోనే రాశారట. ఆ తర్వాత అక్షయ్ సీన్లోకి వచ్చారు. అక్షయ్‌కి ఉన్న పేరు కూడా తక్కువేం కాదు. అందుకే అవుట్ అండ్ అవుట్ విలన్‌గా చూపించాలనుకోలేదని సమాచారం.