శత్రువుల చావు ….అక్షర పుట్టినరోజు బహుమతి !

‘షమితాబ్‌’ అనే బాలీవుడ్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు అక్షరాహాసన్‌. అనంతరం అజిత్‌ హీరోగా నటించిన ‘వివేగమ్‌’ అనే తమిళ చిత్రంలోనూ మెరిశారు. ఇప్పుడీ వెబ్‌సిరీస్‌లో కనిపించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు అక్షర.
‘‘నా వయసు 18…. నాకు నేనే ఓ పుట్టినరోజు బహుమతి ఇచ్చుకోవాలనుకుంటున్నా. అది నా శత్రువుల చావు. నేను బతికి ఉండాలంటే నా శత్రువులను నేను ముందుగా చంపేయాలి. వాళ్లు ఎంతో శక్తిమంతులు. ఈ పోరాటంలో నేను చనిపోవచ్చు కూడా. కనీసం నేను బాధితురాలిని కాదు అనే ధైర్యం ఉంటుంది’’ ఇది షీనా జోస్‌ అనే దర్శక-రచయిత్రి రాసిన పుస్తకం ‘గుడ్‌ బై గర్ల్‌’ కథావస్తువు. చదువుతుంటూనే ఇది ఒక యాక్షన్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌ అని అర్థమైపోతోంది. ఇప్పుడీ కథకు దృశ్యరూపం ఇవ్వనున్నారు.ఆదిత్యా దత్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ వెబ్‌సిరీస్‌లో అక్షరాహాసన్‌ ఫైట్స్‌ కూడా ఉంటాయట. అందుకోసమే ఆమె ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు.

 

కమల్‌, అక్షర, విక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా

కమల్‌హాసన్, ఆయన చిన్న కుమార్తె అక్షరా హాసన్, విక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. అయితే ఇందులో కమల్‌ నటించడంలేదు. విక్రమ్, అక్షర జంటగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని తన సొంత బేనర్‌ రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్‌నేషనల్‌పై కమల్‌హాసన్‌ నిర్మించనుండటం విశేషం.  కమల్‌తో  ‘చీకటి రాజ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజేశ్‌ ఎమ్‌. సెల్వ ఈ చిత్రానికి దర్శకుడు. ‘‘విక్రమ్, అక్షరాహాసన్‌కు థ్యాంక్స్‌. నా శక్తి సామర్థ్యాలను నమ్మిన కమల్‌హాసన్‌గారికి స్పెషల్‌ థ్యాంక్స్‌’’ అన్నారు రాజేశ్‌ ఎమ్‌. సెల్వ.