అళహరి ‘ఆర్‌ యు మ్యారీడ్‌…?’ పాటలు విడుదల !

మౌర్య, చరిష్మా శ్రీకర్‌, వెంకట్‌రాజ్‌, అవంతిక ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘ఆర్‌ యు మ్యారీడ్‌…?’. అళహరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. జయసూర్య స్వరకర్త. ఈ చిత్రంలోని గీతాల్ని సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. మల్కాపురం శివకుమార్‌, అరిమండ విజయశారదారెడ్డి, బి.శ్రీధర్‌, జె.భగవాన్‌, జేవీఆర్‌, సాయివెంకట్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అళహరి ఇందులో ఓ కీలకపాత్ర పోషించారు.

ఈ సందర్భంగా పాల్గొన్న సినీప్రముఖులు మాట్లాడుతూ ….టైటిల్‌ ఎంత భిన్నంగా ఉందో పాటలు కూడా అలాడే ఉంటాయని ఆకాంక్షించారు. ట్రైలర్‌ కూడా ఆకట్టుకునేట్లుగా ఉందన్నారు. కథ విన్నప్పుడే మంచి సినిమాకు పనిచేస్తున్నాననే ఫీల్‌తో ఉన్నానని సంగీత దర్శకుడు జయసూర్య చెప్పారు. తాను అనుకున్నట్టే పాటలు బాగా వచ్చాయని అభిప్రాయ పడ్డారు ఇందులో పాటలతోపాటు మాటలుకూడా రాశానని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఊహించని ట్విస్ట్‌లుంటాయనీ, యూత్‌ ఓరియెంటేడ్‌ కథతో అనుకున్నట్లుగా తెరకెక్కించామనీ, త్వరలో పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు పూర్తిచేసి సినిమాను విడుదల చేస్తామని అళహరి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంచనపల్లి రాజేంద్రరాజుతో పాటు చిత్రబృందం పాల్గొంది.